S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/23/2020 - 04:29

భోపాల్, ఫిబ్రవరి 22: ‘మా రాష్ట్రంలో అటవీ సంపద అతి పెద్ద రాజధానిగా ఉంది..’ అని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అన్నారు. అయితే క్షీణించిన అడవులను పునరుద్ధరించడం అనేది తమ ముందు సవాల్‌గా ఉందని ఆయన తెలిపారు. పరిపాలనా అకాడమీలో శనివారం జరిగిన అటవీ సదస్సుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

02/23/2020 - 04:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశంలో ట్రంప్ పర్యటన కోలాహలం మొదలైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఆయన పర్యటనకు అన్ని వర్గాల నుంచి ఎంతో ఆసక్తి వ్యక్తమవుతోంది. సోమవారం ఆయన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్న దృష్ట్యా ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు ఆగ్రా మేయర్ నదీమ్ కే జైన్ ప్రథమ పౌరుడిగా సిద్ధమవుతున్నారు. ‘వెండితో తయారు చేసిన ఆగ్రా నగర తాళం చెవి’ని ట్రంప్‌కు ఆయన అందించనున్నారు.

02/23/2020 - 04:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌కు ఢిల్లీలోని ఐటీసీ వౌర్య రెస్టారెంట్ ‘బుఖారా’ ఆతిధ్యమిస్తోంది. గతంలో అనేక మంది అతిరథ మహారధులు, దేశాధినేతలు ఇక్కడ బస చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీసమేతంగా రెండు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. ఇంతకు ముందు అమెరికా అధ్యక్షులు బుఖరా ఆతిధ్యం తీసుకున్నారు. ట్రంప్ ఐకాన్ రెస్టారెంట్‌లో విందు చేయనున్నారు.

02/23/2020 - 04:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. దాదాపు వంద కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని ఆమె అన్నారు. అహమ్మదాబాద్‌లోని మెతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమ నిర్వహణకు ఓ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీలో సభ్యులెవరో ఎవరికీ తెలియదని ప్రియాంక అన్నారు.

02/23/2020 - 04:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం జరిపే తాజ్‌మహల్ పర్యటనకు ప్రధాని మోదీ హాజరు కాకపోవచ్చునని అధికార వర్గాలు శనివారంనాడు ఇక్కడ తెలిపాయి. డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న అహ్మదాబాద్ చేరుకుంటారు. ఆయనతోపాటు భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్‌తోపాటు అమెరికా అధికారులు ఎంతోమంది ఉంటారు.

02/23/2020 - 04:23

బెంగళూరు, ఫిబ్రవరి 22: ప్రస్తుత సమాజంలో కొత్త మాధ్యమం ఇంటర్నెట్( అంతర్జాలం), సోషల్ మీడియా( సామాజిక మాధ్యమం) దూసుకొచ్చిందని, ఈ పరిస్థితుల్లో సాంప్రదాయ మాధ్యమం తన పాత్రపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. ‘కొత్త మీడియా వేగంగా దూసుకెళ్తూ ప్రజాదరణ పొందుతోంది. ప్రజలకు ఏ మీడియాను ఎంచుకోవాలి? దేన్ని చూడాలి, ఏది వినాలి అనే అవకాశం వచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు.

02/23/2020 - 01:08

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: చట్టం ప్రాతిపదికపై పని చేయటం ద్వారానే సామాజిక మార్పు, పరివర్తనను సాధించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ‘వ్యవస్థలో జరిగే మార్పులు చట్టం ప్రకారం జరగాలి. సహేతుకంగా ఉండాలి’ అని మోదీ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ శనివారం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రసంగించారు. ‘చట్టం సర్వోన్నతం.

02/21/2020 - 02:14

న్యూఢిల్లీ: లింగ వివక్షను పారద్రోలి స్ర్తి, పురుష సమానత్వం కోసం మరింతగా పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే గురువారం నాడిక్కడ పిలుపునిచ్చారు. మహిళా అధికారుల కోసం ఒక పర్మనెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఈ విషయంలో మరింత స్పష్టత నెలకొందన్నారు.

02/21/2020 - 02:09

చెన్నై, ఫిబ్రవరి 20: ‘భారతీయుడు-2’ చిత్రీకరణ సందర్భంగా క్రేన్ విరిగిన పడిన ఘటనను నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని వెటరన్ నటుడు కమల్‌హసన్ గురువారం స్పష్టం చేశారు. బుధవారం రాత్రి చెన్నైలో జరిగిన ప్రమాద ఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం తనను కలచి వేసిందనీ..

02/21/2020 - 02:05

రాంచీ, ఫిబ్రవరి 20: నేషనలిజం అంటే నాజిజం, ఫాసిజంను గుర్తుకు తెస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. కాబట్టి నేషనలిజం పదం మానేసి నేషనాలిటీ అంటే బావుంటుందని కార్యకర్తలకు ఆయన సూచించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నగరాల్లో, పట్టణాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Pages