S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/25/2020 - 04:25

అహ్మదాబాద్, ఫిబ్రవరి 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంలో హిందీ సినిమా పేర్లు దొర్లుతాయంటే ఎవరైనా నమ్ముతారా? సోమవారంనాడు ఇక్కడి మొతెరా స్టేడియంలో చేసిన ప్రసంగంలో భారతీయ సినిమాల గురించి ట్రంప్ మాట్లాడారు. దిల్ వాలే దుల్హనియా లే జాయెంగే, షోలే సినిమాల పేర్లను ప్రస్తావించారు. బాలీవుడ్ సినిమాల ద్వారానే భారతీయ సంస్కృతిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.

02/25/2020 - 04:31

న్యూఢిల్లీ: సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికి పోయింది. ఇరువర్గాల మధ్య సోమవారం జరిగిన ఘర్షణల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. డిప్యూటీ పోలీసు కమిషనర్‌గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలోని జఫార్‌బాద్, వౌజ్‌పూరలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు ఇళ్లకు, దుకాణాలకు, వాహనాలకు నిప్పుపెట్టారు. పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.

,
02/25/2020 - 04:30

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు సోమవారం సబర్మతి ఆశ్రమంలో అపూర్వ స్వాగతం లభించింది. ప్రజల ఆదరాభిమానాలు చూసిన ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ఉబ్బితబ్బిబ్బయారు. 1917-1930 మధ్య కాలంలో సబర్మతి ఆశ్రమం నుంచే మహాత్మాగాంధీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారు. ఆశ్రమానికి విచ్చేసిన శే్వతసౌథం అధినేత ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.

02/25/2020 - 04:17

అహ్మదాబాద్, ఫిబ్రవరి 24: సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ విజిటర్స్ పుస్తకంలో రాసిన సందేశంలో మహాత్మాగాంధీ పేరును ప్రస్తావించకపోవడం అందరికీ విస్మయాన్ని కలిగించింది. ‘నా స్నేహితుడు నరేంద్ర మోదీకి అద్భుతమైన పర్యటన ఏర్పాట్లకు కృతజ్ఞతలు’ అని మాత్రమే ట్రంప్ రాశారు. ఎప్పుడైతే ట్రంప్ సందేశంలో గాంధీ పేరు లేదో ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి.

02/25/2020 - 04:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ మంగళవారం రాత్రి రాష్టప్రతి భవన్‌లో ఏర్పాటు చేసిన బ్యాక్వెట్ విందును కాంగ్రెస్ నాయకులందరూ బహిష్కరించనున్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పంపించిన విందు ఆహ్వానాన్ని తిరస్కరించారు.

02/25/2020 - 04:28

అహ్మదాబాద్, ఫిబ్రవరి 24: ‘భారత్ ప్రేమికులం..భారత్ విధేయులం’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ సదస్సులో లక్షలాది మందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని తెలిపారు.

02/25/2020 - 04:28

అహ్మదాబాద్, ఫిబ్రవరి 24: భారత్-అమెరికా మధ్య చారిత్రక సంబంధాల్లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఓ నవశకాన్ని ఆవిష్కరించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా అత్యంత విస్తృతమైన, సన్నిహితమైన బంధానికి, అనుబంధానికి కేంద్ర బిందువు అయ్యాయని మోదీ తెలిపారు.

02/25/2020 - 04:27

రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మహా నేతల కలయిక ఓ మహోత్సవమే అయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి భారత పర్యటన రెండు దేశాల మధ్య కొత్త
ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించింది. గుజరాత్‌లోని మొతెరా స్టేడియంలో లక్షలాది మంది సమక్షంలో ట్రంప్, మోదీ చేసిన ప్రసంగాలు రెండు దేశాల బంధానికి
అద్దం పట్టాయి. ఇరు దేశాల మధ్య ప్రభుత్వాలపరంగానే కాకుండా ప్రజలపరంగా

02/24/2020 - 04:12

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రీతిలో లింగపరమైన న్యాయాన్ని తేవడంలో మన న్యాయ వ్యవస్థ విశేషంగా కృషి చేసిందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రశంసించారు. న్యాయ వ్యవస్థ, మారుతున్న ప్రపంచం అనే అంశంపై ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తూ సుప్రీం కోర్టు ఎల్లప్పుడూ క్రియాశీల, ప్రగతి శీలంగా నిలిచిందని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు ప్రగతి శీల సామాజిక పరివర్తనకు దారి తీసిందని అన్నారు.

02/24/2020 - 04:07

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్‌లో పర్యటించనున్న తరుణంలో ఈ అంశంపై ప్రచారం పతాకస్థాయికి చేరింది. అయితే గత ఆరు దశాబ్దాలకు పైగా కాలంలో భారత్‌లో పర్యటించిన ఏడో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలవనున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు భారత్‌లో అధికారికంగా పర్యటించారు.

Pages