జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: జమ్మూకాశ్మీర్‌లో 37 కేంద్ర చట్టాలు అమలుకానున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలోని ఈ చట్టాలను జమ్మూకాశ్మీర్‌లో అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ బుధవారం పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో 370-అధికరణను రద్దు చేసిన తర్వాత అప్పటి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఉమ్మడి జాబితాలో ఉన్న కొన్ని చట్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా అమలుకావు. ఈ సాంకేతికపరమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర కేబినెట్ 37 చట్టాలను జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేసేందుకు ఆమోద ముద్ర వేసింది.