జాతీయ వార్తలు

అందరికీ న్యాయం.. మా ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, ఫిబ్రవరి 29: దేశ ప్రజలందరికీ న్యాయం చేయడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలందరూ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడం, అందరికీ న్యాయం జరిగేలా చూడడమే ప్రభుత్వ బాధ్యత అని, అందరితో కలిసి ప్రగతిపథంలో నడవడం, ప్రతిఒక్కరి విశ్వాసాన్ని చూరగొనాలన్న తమ విధాన ముఖ్య ఉద్దేశం ఇదేనని మోదీ తెలిపారు. దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు భారీ ఎత్తున సహాయ పరికరాల పంపిణీ కోసం శనివారం ఇక్కడ జరిగిన ఓ భారీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. 130 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను ఎంతమాత్రం పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్వం వారి సమస్యలను అర్థం చేసుకుని తగిన న్యాయం చేస్తోందని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి సహాయ శిబిరాలు అతి తక్కువ స్థాయిలోనే జరిగాయని, కానీ గత ఐదేళ్లుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో తొమ్మిది వేలకు పైగా దివ్యాంగుల కోసం ఈ శిబిరాలను తమ ప్రభుత్వం నిర్వహించిందని తెలిపారు. అలాగే తమ ప్రభుత్వం దివ్యాంగులకు 900 కోట్ల రూపాయల విలువ చేసే సహాయ పరికరాలను అందించిందని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ ఆసరా పరికరాల వల్ల దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. అయితే, వీరి నిజమైన శక్తి, సహనం, సామర్థ్యం, మనోవికాసమేనని వెల్లడించారు. అలహాబాద్‌లో తాజాగా నిర్వహించిన ఈ సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డులెన్నింటినో సృష్టించబోతున్నామని అన్నారు. నవభారత నిర్మాణంలో దివ్యాంగులు సహా దేశ యువత కీలక భాగస్వామ్యం ఎంతైనా అవసరమని అన్నారు. దివ్యాంగుల పరిస్థితులను తమ ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకుంటుందని, వారికి అన్నివిధాలుగా చేయూత అందిస్తుందని తెలిపారు.
దాదాపు 30 నిమిషాలపాటు ఈ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. గత నాలుగైదేళ్ల కాలంలో 700కు పైగా రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు సహా అనేక కేంద్రాలను దివ్యాంగులు సైతం ఉపయోగించుకునేలా తీర్చిదిద్దామని, అలాగే దివ్యాంగుల హక్కులను గుర్తిస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని మోదీ వెల్లడించారు. ఈ చట్టం వల్ల వీరికి ఎంతగానో లబ్ధి చేకూరుతోందని అన్నారు. అలాగే సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం కూడా తమ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మూడేళ్ల క్రితం ఇందుకోసం రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమాన్ని చేపట్టామని, దీని ద్వారా వయోవృద్ధులకు అవసరమైన సహాయ పరికరాలు అందిస్తున్నామని తెలిపారు.
*చిత్రం...అలహాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం దివ్యాంగులకు ఆసరా పరికరాలు పంపిణీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ