జాతీయ వార్తలు

వైద్య పరిశోధనలపైనా దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, ఫిబ్రవరి 29: ప్రజలకు ఆరోగ్యపరమైన సేవలు అందించడంతోపాటు వైద్య శాస్త్రాల పరిశోధనలో కూడా ప్రైవేటురంగం క్రియాశీలక భూమిక పోషించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. భువనేశ్వర్‌లో శనివారం ఓ ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన అమిత్ షా ‘వైద్య కళాశాలలను తెరిచినంత మాత్రాన హెల్త్‌కేర్ రంగం పూర్తిగా అభివృద్ధి చెందినట్టు కాదు. వైద్య శాస్త్ర విజ్ఞానంలో ప్రైవేటురంగం పరిశోధనలపై దృష్టి సారించాలి’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా పాల్గొన్నారు. ఒడిశా ప్రజలకు మరింతగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన అమిత్ షా ఎస్‌యూఎం అల్టిమేట్ మెడికేర్ తరహాలో అనేక ప్రైవేటు ఆసుపత్రులు అందుబాటులోకి రావాలని అన్నారు. తమ రాష్ట్రంలో నాణ్యతాయుతమైన హెల్త్‌కేర్ సౌకర్యాన్ని కల్పించినందుకు అనుసంధాన్ చారిటబుల్ ట్రస్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని, దీనివల్ల ప్రజలకు విస్తృతస్థాయిలో ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కోరారు. ఈ ఆసుపత్రిని 10 ఎకరాల స్థలంలో 9 అంతస్థుల భవనంగా నిర్మించారు. అన్నిరకాల వైద్య చికిత్సలను ఒకేచోట లభించేలా అత్యాధునికమైన ఏర్పాట్లను ఇందులో పొందుపరిచామని, ముఖ్యంగా టెక్నాలజీని వినియోగించుకుని రోగ నిర్థారణ, చికిత్స వంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చామని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఆసుపత్రి వల్ల ఈ ప్రాంతవాసులు ఎలాంటి జఠిల ఆరోగ్య సమస్యకైనా నమ్మకంగా చికిత్స పొందే సౌకర్యాలు లభిస్తాయని, రోగి కేంద్రక అత్యాధునిక చికిత్సా విధానం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా రోగ నిర్థారణతోపాటు లోపరహితమైన రీతిలో తక్షణ చికిత్స కూడా అందుబాటులోకి వస్తుందని ఈ ప్రకటనలో వెల్లడించారు.