జాతీయ వార్తలు

ఇంతకంటే మెరుగైంది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఫిబ్రవరి 29: చట్టసభలో ఫిరాయింపుచట్టం పక్కాగా అమలు చేయడానికి వీలుగా చట్టంలో మార్పులు రావల్సిన అవసరం ఉందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీలో శనివారం రాజ్యాంగంలోని 10 షెడ్యూల్‌పై జరిగిన వర్క్‌షాప్‌లో ప్రసంగించారు. కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) సహకారంతో పదో షెడ్యూల్‌లో స్పీకర్ పాత్రపై వర్క్‌షాప్ ఏర్పాటైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మాట్లాడుతూ ఫిరాయింపుప్రజాప్రతినిధులపై చర్యకు సంబంధించి ఇప్పుడున్న దానికంటే మెరుగైన చట్టం లేదని అన్నారు. ‘ ఇప్పుడున్న ఫిరాయింపుల నిరోధక చట్టం కంటే మెరుగైంది లేదు. ఇది నా అభిప్రాయం. వాటికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఇదే అనువైంది. అయితే ఓ గడువులోగా పరిష్కరించే వెసులుబాటు కల్పించాలి. మార్పులు రావల్సి ఉంది’అని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంకు సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధి రాజీనామా చేయాలి. తిరిగి ఎన్నికలకు వెళ్లాలి. అలాడే అతడు/ఆమెకు ఎలాంటి రాజ్యాంగ పదవి ఇవ్వకూడదు. తిరిగి ఎన్నికల్లో గెలిచి వచ్చాకే మంత్రి పదివి లేదా మరేదైనా కట్టబెట్టవచ్చు. అన్నింటి కంటే ముఖ్యం.. ప్రభుత్వం ఏర్పాటు లేదా అవిశ్వాస తీర్మానంలో ఫిరాయింపు సభ్యుడి ఓటును పరిగణనలోకి తీసుకోకూడదు అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు మహాత్మాగాంధీ సిద్ధాంతం, విలువలకు లోబడి నడచుకోవాలని హరివంశ్ ఉద్ఘాటించారు. 2017 నుంచి రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న ఫిరాయింపుఎంపీ కేసులో సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయాలకు సంబంధించి న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకూ ఇప్పుడున్న చట్టం కంటే మెరుగైంది లేదన్న అభిప్రాయం డిప్యూటీ చైర్మన్ వ్యక్తం చేశారు. ఫిరాయింపుల చట్టం కట్టుదిట్టంగా అమలు చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పటిష్టం చేయాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. పార్టీలు మారే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయల పార్టీలకు విరాళాల రూపంలో నల్లధనం చేరుతోందని, తద్వారా రాజకీయ అవినీతి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ మాట్లాడుతూ నియమ, నిబంధనల ప్రకారం సభను నడపడం స్పీకర్ బాధ్యత అని అన్నారు.
*చిత్రం... రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌కు శనివారం జైపూర్‌లో స్వాగతం పలుకుతున్న
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. పక్కన అసెంబ్లీ స్పీకర్ జోషి