జాతీయ వార్తలు

జైలులో నన్ను ఉగ్రవాదిలా చూశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతాపూర్ (యూపీ), ఫిబ్రవరి 29: ‘జైలులో నా పట్ల ఉగ్రవాది తరహాలో అమానవీయంగా ప్రవర్తించారు’ అని సమాజ్‌వాది పార్టీ ఎంపీ ఆజం ఖాన్ ఆరోపించారు. శనివారం ఉదయం ఆజం ఖాన్‌ను సీతాపూర్ జైలు నుంచి రాంపూర్ కోర్టుకు పోలీసు వ్యానులో తరలించారు. ఖాన్ భార్య ఎమ్మెల్యే తంజన్ ఫాతిమా, ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడిన అబ్దుల్లా ఆజంను మరో కేసులో రాంపూర్ కోర్టుకు తీసుకెళ్ళారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టుకు తీసుకెళ్ళారు. వ్యాను కిటికీలో నుంచి ఆజం ఖాన్ మీడియా వైపు చూస్తూ ‘నా పట్ల అమానవీయంగా ప్రవర్తించారు’ అని బిగ్గరగా అరిచారు. ఈ ముగ్గురినీ రాంపూర్ నుంచి సీతాపూర్ జైలుకు గురువారం తీసుకుని వచ్చారు. వీరిని గురువారం కోర్టులో హాజరుపరచగా మార్చి 2వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడం జరిగింది. ఎన్నికల్లో అబ్దుల్లా ఖాన్ నకిలీ జన్మదిన పత్రాన్ని ఇచ్చారన్న అభియోగంతో పోలీసులు అరెస్టు చేశారు. 2017 సంవత్సరం ఎన్నికల్లో అబ్దుల్లా తప్పుడు పత్రాన్ని ఇచ్చారని అలహాబాద్ హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. ఇదిలాఉండగా గత ఏడాది డిసెంబర్‌లో యూపీ అసెంబ్లీ కూడా ఆయన్ను అనర్హునిగా ప్రకటించింది. దీంతో రాంపూర్ నియోజకవర్గానికి ఖాళీ ఏర్పడింది. ఇదిలాఉండగా అజం ఖాన్‌ను రాంపూర్‌లో భూఆక్రమణకు పాల్పడ్డారన్న అభియోగంపై అరెస్టు చేశారు.