జాతీయ వార్తలు

నో స్టాక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ భయం దేశ ప్రజలను వణికిస్తోంది. ఫలితంగా ఎయిర్ మాస్క్‌లకు, శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దేశ రాజధానిలోని చాలావరకు మందుల దుకాణాల్లో మాస్క్‌లు, శానిటైజర్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. కొన్ని దుకాణాల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో వీటి కొరత రోజురోజుకూ పెరుగుతోంది. ఎయిర్ మాస్క్‌ల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు. ఇంతకుముందు 150 రూపాయలు చేసే మాస్క్‌లను ఇప్పుడు 300 రూపాయలకు అమ్ముతున్నారు. అదేవిధంగా శానిటైజర్ల ధరలు కూడా అమాంతంగా ఆకాశానికి అంటున్నాయి. సేవలాన్, డెటాల్ వంటి ప్రముఖ కంపెనీల శానిటైజర్లు కొంతవరకు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ధర గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ఒకప్పుడు 200 రూపాయలకు అమ్మిన ఈ బాటిళ్లు ఇప్పుడు 600 రూపాయల ధర పలుకుతున్నాయి. దుకాణదారులు డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించడానికి ప్రజలు సిద్ధపడుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో అవి దొరకడం లేదు.

*చిత్రం...పాట్నాలో ప్రజలకు మాస్క్‌లు పంపిణీ చేస్తున్న సామాజిక కార్యకర్తలు