S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/11/2020 - 23:29

ముంబయి, మార్చి 11: మహారాష్టలో ఉద్ధవ్‌థాక్రే నేతృత్వంలోని శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం బాగానే పనిచేస్తోందని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం ఇక్కడ కితాబునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటుచేసుకొన్న రాజకీయ సంక్షోభం మహారాష్టల్రో ఎట్టిపరిస్థితుల్లోనూ సంభవించదని పవార్ భరోసా నిచ్చారు.

03/11/2020 - 23:28

న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలోని టెలికాం ఆపరేటర్ల నుంచి 25,900 కోట్ల రూపాయల బకాయిలు వసూలైనట్టు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. దేశంలోని టెలికాం కంపెనీలన్నీ కలిపి లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో ఇటీవల సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే.

03/11/2020 - 23:28

న్యూఢిల్లీ, మార్చి 11: ఈనెల 4వ తేదీనాటికి ఎంపీ ల్యాడ్స్ కింద అందజేసిన మొత్తంలో వినియోగించని నిధులు 5,275.24 కోట్ల రూపాయలని కేంద్ర మంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ లోక్‌సభలో తెలిపారు. ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఎంపీ ల్యాడ్స్ కింద ప్రభుత్వం 53,704.75 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు.

03/11/2020 - 23:27

న్యూఢిల్లీ, మార్చి 11: ఢిల్లీ రైల్వేస్టేషన్‌ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట సమయాన్ని సూచించలేదనీ.. ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారమని రైల్వే శాఖ బుధవారం పార్లమెంట్‌లో పేర్కొంది. ‘ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే లాండ్ డెవలప్‌మెంట్ అథారిటీకి (ఆర్‌ఎల్‌డీఏ) పనులు అప్పగించామనీ..

03/11/2020 - 06:58

న్యూఢిల్లీ: మధ్య ప్రదేశ్‌లో రాజకీయాలు మలుపులు తిప్పి చివరకు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల 12న బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అంతేకాదు ఆ మర్నాడే బీజేపీ తరఫున రాజ్యసభకూ నామినేషన్ దాఖలు చేసేందుకు ఆ పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

03/11/2020 - 06:56

*చిత్రం... కరోనా వైరస్ రక్షిత మాస్క్ ధరించి మంగళవారం జబల్‌పూర్‌లో భక్తులను ఆశీర్వదిస్తున్న స్వామి వసుదేవానంద మహారాజ్

03/11/2020 - 06:55

లక్నో, మార్చి 10: ఉత్తరప్రదేశ్‌లో సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వారి పేర్లతో రాజధాని కూడళ్లలో ఏర్పాటు చేసిన పోస్టర్లను తక్షణం తొలగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలా వద్దా అన్నదానిపై ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

03/11/2020 - 06:50

బెంగళూరు, మార్చి 10: కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర శాఖలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో బెంగళూరు నగరంలో ఉన్న ఆ పార్టీకి చెందిన 19మంది ఎమ్మెల్యేలు తమకు రక్షణ కల్పించాలని, పోలీస్ ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)కు లేఖ రాశారు. ‘మేము మా ఇష్టపూర్వకంగా ఒక ముఖ్యమయిన పని మీద కర్ణాటక రాష్ట్రానికి వచ్చాం.

03/11/2020 - 06:48

న్యూఢిల్లీ, మార్చి 10: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల సొంత పార్టీ యువతకే విశ్వాసం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేయడమే ఇందుకు ఉదాహరణ అని హుస్సేన్ మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. సింధియా విలువలతో కూడిన గౌరవప్రదమైన నాయకుడని ఆయన తెలిపారు.

03/11/2020 - 06:47

న్యూఢిల్లీ, మార్చి 10: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అందుకే కొత్త రాజకీయ జీవితం కోసం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీకి మంళవారం రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Pages