జాతీయ వార్తలు
ఢిల్లీ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ‘గడువు’ లేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 11: ఢిల్లీ రైల్వేస్టేషన్‌ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట సమయాన్ని సూచించలేదనీ.. ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారమని రైల్వే శాఖ బుధవారం పార్లమెంట్‌లో పేర్కొంది. ‘ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే లాండ్ డెవలప్‌మెంట్ అథారిటీకి (ఆర్‌ఎల్‌డీఏ) పనులు అప్పగించామనీ.. అయితే, దీనికి సంబంధించి నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించలేదు’ అని రైల్వే మంత్రి పియూష్ గోయల్ లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానంలో వివరించారు. ఈ పనులకు సంబంధించి ఆర్‌ఎల్‌డీఏ డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు)ను, మాస్టర్ ప్లాన్, బిడ్ డాక్యుమెంట్‌ను అందించాల్సి ఉందని చెప్పారు. ప్రైవేటు - ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక పరమైన అంశాలపై అధ్యయనం కూడా అవసరమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చట్టపరమైన క్లియరెన్స్‌లు కూడా అవసరమని చెప్పారు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిర్దిష్ట సమయాన్ని చెప్పలేమని మంత్రి పేర్కొన్నారు.
మూడేళ్లలో లక్షన్నర రైల్వే ఉద్యోగాలు భర్తీ చేశాం
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా గత మూడేళ్లలో దాదాపు లక్షన్నర గ్రూప్ ‘సీ’ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బుధవారం వెల్లడించింది. కేంద్రీకృత ఎప్లాయిమెంట్ నోటిఫికేషన్ ద్వారా మరో మూడు కేటగిరీల్లో నియామకాలకు సంబంధించి పరీక్షలు రానున్న కొద్ది నెలల్లో జరగనున్నాయని రైల్వే మంత్రి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ‘గత మూడేళ్లలో అంటే 2017-2018 నుంచి 2019-2020 (మార్చి ఐదో తేదీ వరకు) మొత్తం లక్షా 47వేల 620 గ్రూప్ ‘సీ’ ఉద్యోగాలను (లెవెల్-1 సహా) భర్తీ చేసినట్లు ఆయన వివరించారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా ఈ భర్తీ జరిగినట్లు పార్లమెంట్‌లో పియూష్ గోయల్ స్పష్టం చేశారు.