జాతీయ వార్తలు

పోస్టర్ల వివాదంపై సుప్రీంకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 10: ఉత్తరప్రదేశ్‌లో సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వారి పేర్లతో రాజధాని కూడళ్లలో ఏర్పాటు చేసిన పోస్టర్లను తక్షణం తొలగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలా వద్దా అన్నదానిపై ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
సీఏఏ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా జరిగిన విధ్వంస కార్యక్రమాల్లో పాల్గొన్న వారి పేర్లు, ఫొటోలు, చిరునామాలతో ముద్రించిన పోస్టర్లు లక్నో నగర కూడళ్లలో ప్రదర్శించారు. గత మంగళవారం ప్రధాన కూడళ్లలో వెలసిన పోస్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తక్షణం పోస్టర్లను తొలగించాలని లక్నో అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ‘అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలా వద్దా అన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీర్పును సమీక్షించిన తరువాత ముందుకెళ్తాం’అని ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ అవనీష్ అవస్థి వెల్లడించారు. పోస్టర్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయనుందన్న మీడియాలో వచ్చిన కథనాలు ఆయన దృష్టికి తీసుకురాగా ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఈ విషయంపై సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశం ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించగా‘అలాంటి సమావేశం ఏదీ జరగలేదు’అని అవస్థి బదులిచ్చారు. నిరసన తెలిపే స్వేచ్ఛ పౌరులకు ఉంటుందని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథూర్, న్యాయమూర్తి రమేష్ సిన్హాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ తీరును ధర్మాసనం తప్పుపట్టింది. అలాగే తక్షణమే పోస్టర్లు తొలగించి వచ్చే సోమవారం నివేదిక ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్, లక్నో పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.