జాతీయ వార్తలు
సింధియా తొందర పడ్డారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, మార్చి 11: మహారాష్టలో ఉద్ధవ్‌థాక్రే నేతృత్వంలోని శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం బాగానే పనిచేస్తోందని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం ఇక్కడ కితాబునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటుచేసుకొన్న రాజకీయ సంక్షోభం మహారాష్టల్రో ఎట్టిపరిస్థితుల్లోనూ సంభవించదని పవార్ భరోసా నిచ్చారు. మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరేందుకు ‘తొందర’ పడ్డారని పవార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సింధియా నిర్ణయంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షోభంపై మాట్లాడుతూ ‘మధ్యప్రదేశ్‌లో సమర్థవంతమైన, మంచి నాయకత్వంలోనే ప్రభుత్వం నడుస్తోందని’ స్పష్టం చేశారు. ‘కమల్‌నాథ్ సామర్థ్యంపై కొంతమందికి బాగానే నమ్మకం ఉంది.. అద్భుతాలు జరిగే పరిస్థితి లేకపోలేదు’ అని పవార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.