జాతీయ వార్తలు
అగమ్యగోచరంగా కాంగ్రెస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 10: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అందుకే కొత్త రాజకీయ జీవితం కోసం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీకి మంళవారం రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 18 ఏళ్లపాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యుడుగా కొనసాగిన తాను ఇక మీదట కొత్త రాజకీయ జీవితాన్ని తాజాగా ప్రారంభించేందుకు ముందుకు సాగిపోవలసిన సమయం వచ్చిందని ఆయన తన లేఖలో వివరించారు. కాంగ్రెస్ పార్టీ గమ్యం కోల్పోయిందనేది సోనియా గాంధీకి కూడా తెలుసునని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
మొదటినుండి తన ఏకైక లక్ష్యం దేశం, రాష్ట్రం కోసం పనిచేయడమని, అయితే కాంగ్రెస్‌లో ఉండడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నానని జ్యోతిరాదిత్య సింధియా తన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. తనను ఆదరించే ప్రజలు, తనను అభిమానించే కార్యకర్తల ఆకాంక్షల సాధన కోసం తాజాగా రాజకీయాన్ని ప్రారంభించేందుకు ఉద్యుక్తుడనవుతున్నానని ఆయన తెలిపారు. అయితే తాజా ప్రారంభం ఏమిటనేది జ్యోతిరాదిత్య సింధియా తన రాజీనామా లేఖలో పేర్కొనలేదు.
అయితే బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడంతోపాటు కేంద్రంలో మరోసారి కేబినెట్ మంత్రి పదవి చేపట్టడమే ఆయన చేసే తాజా ప్రారంభం అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలావుండగా, జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా లేఖ అందిన కొన్ని క్షణాలకే ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఒక ప్రకటన జారీ చేయడం గమనార్హం.