జాతీయ వార్తలు
రక్షణ కల్పించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బెంగళూరు, మార్చి 10: కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర శాఖలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో బెంగళూరు నగరంలో ఉన్న ఆ పార్టీకి చెందిన 19మంది ఎమ్మెల్యేలు తమకు రక్షణ కల్పించాలని, పోలీస్ ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)కు లేఖ రాశారు. ‘మేము మా ఇష్టపూర్వకంగా ఒక ముఖ్యమయిన పని మీద కర్ణాటక రాష్ట్రానికి వచ్చాం. మేము బెంగళూరులో, దాని చుట్టుపక్కల స్వేచ్ఛగా తిరగడానికి, స్వేచ్ఛగా బస చేయడానికి స్థానిక పోలీసుల నుంచి రక్షణ, ఎస్కార్ట్ అవసరం ఉన్నది’ అని మార్చి తొమ్మిదో తేదీన రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై 19 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఆరుగురు మంత్రులు సహా ఈ 19 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను మంగళవారం బెంగళూరు నుంచి ఈ-మెయిల్‌లో భోపాల్‌లోని రాజ్‌భవన్‌కు పంపించారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులు తిరుగుబాటు చేయ డం, సింధియా మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరేట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
దీంతో గత 15 నెలలుగా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగళూరులో ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
*చిత్రం...బెంగళూరులో మకాం వేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం తమ రాజీనామా లేఖలను మీడియాకు చూపిస్తున్న దృశ్యం