జాతీయ వార్తలు
టెలికాం కంపెనీల నుంచి రూ.25,900 కోట్లు వసూలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలోని టెలికాం ఆపరేటర్ల నుంచి 25,900 కోట్ల రూపాయల బకాయిలు వసూలైనట్టు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. దేశంలోని టెలికాం కంపెనీలన్నీ కలిపి లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో ఇటీవల సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. బకాయిలన్నీ సత్వరం చెల్లించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సుప్రీం ఆదేశాలు జారీ చేసిన తర్వాత టెలికాం కంపెనీలు బకాయిలను చెల్లిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ 18,004 కోట్లు, వొడాఫోన్ ఐడియా 3,500 కోట్లు, టాటా టెలి సర్వీస్ 4,197 కోట్ల రూపాయలు చెల్లించినట్టు మంత్రి సంజయ్ వివరించారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి 3.90 కోట్ల రూపాయలు వసూలైనట్టు చెప్పారు. అదేవిధంగా రిలయన్స్ జియో 195 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినట్లు మంత్రి వివరించారు. మరో ప్రశ్నకు ఆయన స్పందిస్తూ టెలికాం ఆపరేటర్లు ఈ రంగాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకోకుండా నియంత్రించే చట్ట ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి చెప్పారు.