జాతీయ వార్తలు
గాంధీ కుటుంబం పట్ల యువతకు విశ్వాసం లేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 10: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల సొంత పార్టీ యువతకే విశ్వాసం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేయడమే ఇందుకు ఉదాహరణ అని హుస్సేన్ మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. సింధియా విలువలతో కూడిన గౌరవప్రదమైన నాయకుడని ఆయన తెలిపారు. సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఆ పార్టీలో యువతకు నాయకత్వం పట్ల విశ్వాసం లేదని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ముగింపునకు ఇది తొలి అడుగు అని ఆయన తెలిపారు. గాంధీ కుటుంబం నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉండదని, భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆ పార్టీలోని యువత భావిస్తున్నదని ఆయన చెప్పారు.