జాతీయ వార్తలు
వినియోగించని ఎంపీ ల్యాడ్స్ రూ.5,275 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 11: ఈనెల 4వ తేదీనాటికి ఎంపీ ల్యాడ్స్ కింద అందజేసిన మొత్తంలో వినియోగించని నిధులు 5,275.24 కోట్ల రూపాయలని కేంద్ర మంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ లోక్‌సభలో తెలిపారు. ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఎంపీ ల్యాడ్స్ కింద ప్రభుత్వం 53,704.75 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. ఈనెల 4వ తేదీ వరకు అందిన లెక్కల ప్రకారం ఇందులో 51,267.75 కోట్ల రూపాయలు ఎంపీలు వెచ్చించినట్టు తెలిపారు. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అందజేసిన వివరాల ప్రకారం 2019 మార్చి 31 తేదీ నాటికి వినియోగించని నిధులు మొత్తం 4,103.97 కోట్ల రూపాయలుగా ఉందని ఆయన చెప్పారు. అదేవిధంగా 2018 మార్చి 31 నాటికి ఈ మొత్తం 5,029.31 కోట్లుగా ఉందని అన్నారు. నియోజకవర్గ పరిధిలో స్థానికంగా అభివృద్ధి పనుల కోసం లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ (ఎంపీ ల్యాడ్స్) నిధులు కేటాయిస్తారు. ఈ మొత్తాలను వివిధ అభివృద్ధి పనుల కోసం వినియోగించే అధికారం సదరు ఎంపీలకు ఉంటుంది. 5 కోట్ల రూపాయలకు మించని పనులకు సంబంధించిన బాధ్యతలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పే అవకాశం కూడా ఉంది. నియోజకవర్గంలోని జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఎంపీ ల్యాడ్స్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.