జాతీయ వార్తలు

కరోనా వైరస్ పై ప్రధాని సమీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి రోజు సమీక్షిస్తున్నారని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు. ఇంత వరకు విదేశాల నుండి వచ్చిన పదహారు లక్షల మంది ప్రయాణికులను పరిశీలించడం జరిగిందని, కొత్తగా 34 వైరాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, విమానాశ్రయాల్లో దిగగానే వీసా ఇచ్చే విధానాన్ని తాత్కాలికంగా రద్దు చేయటం జరిగిందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. అనంతరం మంత్రి జవడేకర్ విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్‌పై మంత్రివర్గంలో జరిగిన చర్చ గురించి వివరించారు. కరోనా వైరస్ గురించి దేశ ప్రజలను జాగృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు ఇంత వరకు విమానాశ్రయాల్లో ఆరు లక్షల మంది ప్రయాణికులను, భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో పది లక్షల మందితో సహ మొత్తం 16 లక్షల మందిని స్క్రీన్ చేయటం జరిగిందన్నారు. నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో ఉన్న మన గ్రామాల్లో సైతం స్క్రీనింగ్ చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఇంత వరకు పూణేలో ఒకే ఒక వైరాలజీ ల్యాబ్ ఉండేదంటూ ఇప్పుడు కొత్తగా 15 వైరాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. మరి కొన్ని రోజుల్లో మరో 19 వైరాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు జవడేకర్ ప్రకటించారు. దేశంలోని 21 విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ జరుపుతున్నామన్నారు. కరోనా వైరస్ మూలంగా దేశంలో ఉత్పన్నమైన పరిస్థితి, వైరస్‌ను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిగిందని ఆయన తెలిపారు. క్యాబినెట్ కార్యదర్శి ప్రతి రోజు రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. విదేశాలకు వెళుతున్న భారతీయులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని, విదేశాల నుంచి వస్తున్న విదేశీయులకు విమానాశ్రయానికి రాగానే వీసాలిచ్చే విధానాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా వైర స్ పట్ల ప్రజలను జాగృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గత నాలుగు మంత్రివర్గ సమావేశాల్లో కూడా కరోనా వైరస్ గురించి చర్చించి పరిస్థితిని సమీక్షించామన్నారు.