జాతీయ వార్తలు

70 శాతం తగ్గిన చొరబాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో 2013తో పోలిస్తే 2019 సంవత్సరంలో చొరబాటు సంఘటనలు బాగా తగ్గాయనీ.. అలాగే, పౌరుల మరణాల సంఖ్య కూడా 80 శాతం తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. భద్రతా దళాల్లో క్షతగాత్రులైన వారి సంఖ్య కూడా 2014 నుంచి ఇప్పటి వరకు 78 శాతం తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో భద్రత గతంతో పోలిస్తే చాలా మెరుగుపడిందని రాజ్యసభలో బుధవారం ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాలకు 2013తో పోలిస్తే చొరబాట్లు 70 శాతం తగ్గాయి.. పౌరుల మరణాలు కూడా 80 శాతం తగ్గాయి.. భద్రతా దళాల్లో క్షతగాత్రులౌతున్న వారి సంఖ్య కూడా 80 శాతం మేర తగ్గింది’ అని కిషన్ రెడ్డి వివరించారు. 2014 నుంచి 2019 వరకు 1824 మంది చొరబాటుదార్లు లొంగిపోయారని పేర్కొన్నారు. ఇటీవల ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ గత సంవత్సరం ఆగస్టులో కుదుర్చుకొన్న ఒప్పందం మేరకు ఆ సంస్థకు చెందిన 88 మంది లొంగిపోయారని ఆయన చెప్పారు. గత నెల 23న వివిధ సంస్థలకు చెందిన 1615 మంది ఎన్డీఎఫ్‌బీకి చెందిన వారు సైతం లొంగిపోయినట్లు మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
*చిత్రం...కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి