జాతీయ వార్తలు

అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించింది. ప్రపంచ దేశాలన్నీ ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలని పేర్కొంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా ప్రాంతంలోని దేశాలు అన్నివిధాల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కరోనా వైరస్ సమస్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అది వ్యాపించకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ప్రాంతంలోని 11 దేశాలకుగాను 5 దేశాల్లో ఇప్పటికే కరోనా వైరస్ తీవ్రత పెరిగిందని డబ్ల్యూహెచ్‌ఓ తన ప్రకటనలో గుర్తు చేసింది. ఇప్పటివరకు థాయిలాండ్‌లో 43 మంది, భారత్‌లో 28 మంది, ఇండోనేషియాలో ఇద్దరు, శ్రీలంక, నేపాల్‌లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వైరస్ బారిన పడినట్టు సమాచారం అందిందని పేర్కొంది.
వైరస్ సోకిన వారిని ప్రత్యేక ప్రాంతాలు లేదా వార్డుల్లో ఉంచి చికిత్స జరిపించాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనమ్ క్షేత్ర పాల్ సింగ్ సూచించారు. మాస్క్‌లు, గ్లోవ్స్‌లు వాడాలని పేర్కొన్నారు. ఒకరికి కరోనా వైరస్ సోకితే సదరు వ్యక్తి ఎవరెవరిని కలిశారన్న వివరాలను సేకరించి, ఆయా ప్రాంతాల్లో, ఆయా వ్యక్తులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.