జాతీయ వార్తలు

రైళ్లలో ఫస్ట్ ఎయిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: రైళ్లలో ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు యుద్ధప్రాతిపదికంగా కల్పిస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సుమారు 60 వేల మంది ప్రయాణికులు ఫస్ట్ ఎయిడ్ కోసం విజ్ఞప్తులు పంపించారని ఆయన అన్నారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాన్ని కల్పించామని అన్నారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లను కూడా పిలిపించే అవకాశం కల్పించామని, అయితే సదరు ఖర్చును ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరో ప్రశ్నపై ఆయన స్పందిస్తూ జమ్మూకాశ్మీర్‌లో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తూ 44 ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్టు గోయల్ తెలిపారు. సుమారు 13,120 కోట్లరూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రతిపాదనలు జమ్మూకాశ్మీర్ సర్కారుకు అందినట్టు ఆయన వివరించారు.