జాతీయ వార్తలు

సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, మార్చి 4: సోషల్ మీడియాపై జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని నెలలుగా ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, ఇంటర్‌నెట్ స్పీడ్‌ను మాత్రం 2-జీ స్పీడ్‌కు పరిమితం చేసింది. ఈనెల 17వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. 370 ఆర్టికల్ రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాపై నిషేధాన్ని విధించారు. అదేవిధంగా మొబైల్, ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో మొబైల్ సేవలపై ఉన్న ఆంక్షలను సడలించారు. కొన్ని పరిమిత ప్రాంతాల్లో, విపరీతమైన వేళల్లో మాత్రమే మొబైల్, ఇంటర్‌నెట్ సేవలపై ఆంక్షలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ పలు సందర్భాల్లో ప్రకటించింది. ప్రజలను భయభ్రాంతులను చేయడానికి లేదా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి కేంద్రం సోషల్ మీడియాపై నిషేధాన్ని విధించింది. అవాస్తవాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉన్న కారణంగా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని ప్రకటించిన అధికారులు సోషల్ మీడియాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇంటర్‌నెట్ సేవలను మాత్రం 2-జీ వరకే పరిమితం చేశారు. ఈనెల 17 తర్వాత పరిస్థితిని సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.