జాతీయ వార్తలు

పార్లమెంట్‌ను సాగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఇటీవలి ఢిల్లీ అల్లర్లలో చర్చ జరిగే వరకు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాల్సిందేననీ.. సభలో దీనిపై చర్చ ప్రారంభించనంత వరకు సభను సజావుగా సాగనివ్వబోమని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి బుధవారం పార్లమెంట్ వెలుపల విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ‘పార్లమెంట్ రెండు సభల్లో ఢిల్లీ అల్లర్లను ప్రస్తావించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.. అల్లర్లకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.. మత ఘర్షణలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని చౌదరి డిమాండ్ చేశారు. హోలీ తరువాత ఈ అంశాన్ని చర్చకు తీసుకొస్తామని అపభుత్వం చెబుతోంది.. ముఖ్యమైన అంశం అయినందున దీనిని వాయిదా వేయవద్దని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని ఆయన వివరించారు. ‘ఈ రోజు కూడా మేం హౌస్‌లో నిరసన తెలియజేశాం.. ఢిల్లీ అల్లర్లపై చర్చ ప్రారంభించే వరకు మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది.. పార్లమెంట్ లోపల, వెలుపల మేం ఆందోళన చేస్తూనే ఉంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. అల్లర్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయంటూ జవాబుదారీతనం లేకుండా కేంద్ర ప్రభు త్వం మాట్లాడుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నసీర్ హుస్సేన్ ఆరోపించారు. ఇటు హోం మంత్రి అమిత్ షా కానీ అటు ప్రధానమంత్రి మోదీ కానీ ఈ విషయమై మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని వివరించారు. మేము పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా ఉండాలని నిర్ణయించాం.. అంతవరకు సభను సజావుగా సాగనిచ్చే ప్రస క్తే లేదని ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.