జాతీయ వార్తలు

బెంగాల్‌లో సత్తా చాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా కమలనాథులు రాష్ట్రంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలతో చర్చలు జరిపారు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. బీజేపీ ఎంపీలతో విడివిడిగా సమావేశమవుతూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాల్సిందిగా సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షే పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. 2021 ఏప్రిల్ లేదా మే నెలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈలోగానే రాష్ట్రంలో తృణమూల్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని తీర్చిదిద్ది ప్రజల్లోకి ఓ స్పష్టమైన సంకేతం ఇవ్వాలని మోదీ ఎంపీలకు పిలుపునిచ్చారు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికలను ఆయనీ సందర్భంగా ఎంపీలకు గుర్తుచేశారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు షాక్ ఇచ్చారు. 42 లోక్‌సభ స్థానాల్లో 18 చోట్ల కమలనాథులు విజయం సాధించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మంగా వ్యవహరించాలని, హిందూ సమీకరణలు కలిసొచ్చేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని బీజేపీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి అజెండాతో రాజకీయ చతురత ప్రదర్శించి పార్టీని అగ్రస్థానంలో నిలపాలని ప్రధాని నిర్దేశన చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మోదీతో సమావేశం విషయాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఓ వార్త సంస్థకు తెలిపారు. దిలీప్ ఘోష్, లాకెట్ చటర్జీ ఇద్దరూ పార్లమెంట్‌లో గట్టిగా తమ వాణి వినిపిస్తున్నారు. వీర్దరితో సమావేశమైన ప్రధాని మోదీ రాష్ట్రంలో పార్టీ పనితీరు, కేంద్ర సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 295 స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ 211 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్, వామక్షాలు కలిసి పోటీ చేసి 70 స్థానాలు దక్కించుకున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి కేవలం మూడు సీట్లే వచ్చాయి. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయంగా పెను మార్పులు సంభవించడంతో పశ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీ బలపడుతూ వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. అంతే కాదు పది శాతం ఉన్న ఓట్ల వాటాను 40 శాతానికి పెంచుకుంది. అధికార తృణమూల్ పార్టీ ఓటు శాతం 44 మాత్రమే. లోక్‌సభ ఎన్నికల ఊపునే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాటాలన్నది బీజేపీ అధిష్ఠానం ఆలోచన.