జాతీయ వార్తలు

న్యాయ విచారణ జరపాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: ఢిల్లీ అల్లర్లపై న్యాయ దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. స్వతంత్రంగా కోర్టు పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు జరగాలని, అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఢిల్లీలో అల్లర్లను రెచ్చగొట్టే రీతిలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయాలని కూడా కేంద్రాన్ని కాంగ్రెస్ కోరింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజధర్మాన్ని విస్మరించిందని, ఢిల్లీ పౌరులకు తగిన రక్షణ కల్పించడంలో విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకుల్ వాస్నిక్ అన్నారు. ఢిల్లీలో అల్లర్లు తమ కళ్ల ముందే తీవ్ర స్థాయిలో జరుగుతున్నా పోలీసులు అచేతనంగా ఉండిపోయారని ఆయన ఆరోపించారు. అసలు ఢిల్లీలో హింసాకాండకు దారితీసిన పరిణామాలేమిటి అన్న వాస్తవాలను నిర్ధారించడంతోపాటు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి బాధ్యతను కూడా వెలుగులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు లేదా సుప్రీం కోర్టు నాయమూర్తి పర్యవేక్షణలోనే ఈ విచారణ జరిపి అల్లర్ల మూలాలను వెలికితీయాలని అన్నారు. ఢిల్లీ ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించడంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికను సోమవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేసింది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లపై పరిశీలన జరిపి నివేదిక అందించాలని కోరుతూ ఈ కమిటీని సోనియా గాంధీ ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ముకుల్ వాస్నిక్, తారిక్ అన్వర్, సుస్మితా దేవ్, కుమారి షెల్జాతో కూడిన ఈ కమిటీ ఈశాన్య ఢిల్లీ ప్రాంతవాసులతో మాట్లాడింది.
కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్ షా ఢిల్లీ హింసాకాండను నివారించడంలో తగిన చర్యలు తీసుకోలేకపోయారని వాస్నిక్ ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని, అలాగే రెచ్చగొట్టే రీతిలో మాట్లాడిన కొందరు బీజేపీ నేతలపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. తక్షణమే ఢిల్లీవాసుల్లో విశ్వాసాన్ని పాదుగొల్పడంలో చర్యలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగానే ఈ అల్లర్లు జరగడం వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మంటగలిసిందన్నారు.

*చిత్రం... కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకుల్ వాస్నిక్