జాతీయ వార్తలు

అల్లర్లకు వౌనసాక్షి శివ్ విహార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: అల్లర్లతో అట్టుడికిపోయిన ఈశాన్య ఢిల్లీలోని శివ్ విహార్ విధ్వంసానికి వౌన సాక్షిగా మిగిలింది. ఆ ప్రాంతమంతా సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయింది. అల్లర్లు, దహనాలు, దాడులకు భయపడిపోయిన ఇళ్లను వదిలి బంధువుల వద్ద తలదాచుకున్న ఈశాన్య ఢిల్లీ వాస్తులు రెండు వారాల తరువాత తిరిగి వస్తున్నారు. శిథిల ప్రాంతంగా శివ్ విహార్ సాక్షాత్కరిస్తోంది. స్థానికులకు రెండు వారాలూ బంధువుల ఇళ్లే వారికి తాత్కాలిక పునరావాస కేంద్రాలు. ఫిబ్రవరి 24 నుంచి ఇరువై వరకూ అడ్డూఅదుపూలేని అల్లర్లు జరిగాయి. 1984 సిక్కుల ఊచకోత ఘటన తరువాత అంత పెద్ద ఎత్తున దాడులు జరగడం ఇదే. వీధుల్లో దహనాల తాలూకూ దట్టమైన పొగ.. ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత వాతావరణం వెరసీ స్థానికుల కంటి మీద కునుకులేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు విచ్చలివిడిగా ధ్వంసమయ్యాయి. వాహనాలపై దాడులు, రాళ్ల వర్షం సాగిపోయింది. అల్లర్లను పోలీసు బలగాలే అదుపుచేయలేని భయానక పరిస్థితి ఏర్పడింది. ఆదివారం సాయంత్రం మొదలైన ఆందోళనలు సోమవారం వికృత రూపం దాల్చాయి. శివ్ విహార్ వాసులు ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నారు. ఆ రాత్రి ఎదురైన సంఘటనలను మహ్మద్ నఫీ సోమవారం ఓ వార్తా సంస్థకు వివరించాడు. పరిస్థితి భయానకంగా మారడంతో అందరం కలిసి బంధువుల ఇంటికి వెళ్లిపోదామని ఫోన్ రావడంతో తరలివెళ్లిపోయి తలదాచుకున్నట్టు అతడు చెప్పాడు. ఇది తమ కుటుంబం ఒక్కరిదే కాదని అందరి పరిస్థితి ఇలా ఉందని, రెండు సోమవారాలు చుట్టాల ఇళ్లలోనే శరణార్థులుగా గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని మహ్మద్ నఫీ చెప్పాడు ఈశాన్య ఢిల్లీలో వేలాది మంది స్థానికులకు ఇదే పరిస్థితి. వ్యాపారాలు పోయాయి. నిలవనీడ కూడా కోల్పోయే అనిన్చిత పరిస్థితి. మహ్మద్ నఫీ (41) కుటుంబ సభ్యులు 14 మందితో కలిసి శివ్ విహార్‌లోని 12 గల్లీలో మూడు అంతస్తుల భవనంలో ఉండేవారు. రెండు వారాల క్రితం జరిగిన అల్లర్లు స్థానికులకు పీడకలే. ఆస్తులన్నీ లూటీ చేశారు. ఆస్తులు దహనం చేశారు. తమకు ప్రభుత్వ పునరావాస కేంద్రాలు లేదా బంధువుల ఇళ్లే తమకు దిక్కయ్యాయని అతడు ఆవేదన చెందాడు. తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకున్న శివ్ విహార్ వాసులందరూ ఇళ్లకు తిరిగి రావడం మొదలైంది. ఇళ్లకు తిరిగొచ్చిన వారికి భవిష్యత్ అంధకారంగా కనిపించింది. అల్లరి మూకల విధ్వంసం కళ్లెదుట కనిపించింది. ఎనిమిదితో తరగతి విద్యార్థి సైఫ్ వార్షిక పరీక్షలు రాయలేకపోయాడు. శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. మహ్మద్ గయూర్ చెందిన రెండు అంతస్తుల భవనం ధ్వంసమైంది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని మూడు బైక్‌లు తగలబెట్టారు. భవనానికి నిప్పుపెట్టడంతో సిలెండర్లు పేలిపోయి మూడు గదులు నామరూపాల్లేకుండా పోయాయి. అదే సమయంలో పోలీసులు ఆ ప్రాంతం ఖాళీ చేయమని హెచ్చరించడంతో ఫిబ్రవరి 26 ఉదయం అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు అతడు పేర్కొన్నారు. కనీసం కాళ్లకు చెప్పులు లేకుండా ఇళ్లు వదలి వెళ్లిపోయినట్టు ఆయన తెలిపాడు. మర్నాడు మధ్యాహ్నం వచ్చి చూస్తే మొత్తం శిథిలమైపోయి కనిపించిందని ఆందోళన చెందాడు. హింసకు భయపడి అక్కడకు సమీపంలో ముస్త్ఫాబాద్‌కు వెళ్లి తలదాచుకున్నారు. మహిళలు, పిల్లలు మాత్రం ఈద్గా పునరావాస కేంద్రంలో గడిపారు. నజర్ మహ్మద్‌ది అలాంటి గాథే. విచ్చలవిడిగా హింస చోటుచేసుకోవడంతో అక్కడకి కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఛమన్ పార్క్ వద్ద బావమరిది ఇంటికి తరలి వెళ్లిపోయారు. ఈ రెండు వారాలూ భార్య, ముగ్గురు పిల్లలు అక్కడే గడిపారు. ‘అల్లర్ల జరిగిన రోజు దగ్గర్లోనే పునరావాస కేంద్రాకి వెళ్లాం. దుండగులు అక్కడకు వచ్చి గొడవ చేసి గాయపరిచారని 44 ఏళ్ల ఆర్ట్ టీచర్ వాపోయాడు. ‘మా అబ్బాయి తిరిగి ఇంటికి రానని చెప్పాడు’ అని ఆయన భార్య ఇర్షాద్ బేగం తెలిపారు. సైమూర్ ఖాన్(42) ఇల్లు దాడులకు సజీవ సాక్ష్యంగా మిగిలింది. తలుపులు పగల గొట్టేశారు. ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. బట్టలు, సూట్‌కేసులు, వస్తువులు ఎత్తుకెళ్లారు. దాడులకు భయపడి బాబూనగర్‌లోని అత్తవారింటికి వెళ్లి ఈ రెండు వారాలూ తలదాచుకున్నారు. ‘ఈ ఉదయం శివ్ విహార్ వచ్చి చూస్తే గుండె తరక్కుపోయింది. ఎటు చూసినా విధ్వం సం తాలూకూ గుర్తులే. ఎప్పటికి కోలుకుంటామో నాకయితే అర్థం కావడం లేదు’అని అతడు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించి 700 కేసులు నమోదయ్యాయి.