జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభాన్ని ప్రియాంక గాంధీ గట్టెక్కించేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మార్చి 9: మధ్య ప్రదేశ్ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్ది, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని తమ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పంపించాలన్న డిమాండ్ ఆ పార్టీ నేతల నుంచి పెరుగుతోంది. మరోవైపు బీజేపీ విమర్శలు కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడుతున్నది. కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, బీజేపీ వెంటాడడం వంటి చిక్కు సమస్యల నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అధిష్టానంతో చర్చించేందుకు ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 26న రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పార్టీ సీనియర్, ముఖ్య నేతలతో మంతనాలు జరపనున్నారు. ఈ పర్యటనలో కమల్‌నాథ్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియాను, ఇతర పార్టీ పెద్దలను కలుసుకోనున్నారు. మధ్య ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సారథ్యంలో గల సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరమయ్యారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే ఇద్దరు ఎమ్మెల్యేలను బీజేపీ అపహరించిందని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణను బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ నాయకత్వం అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దుకోలేక తమపై విమర్శలు చేయడం భావ్యం కాదని పేర్కొంది. ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రియాంక గాంధీని మధ్య ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నుకున్నట్లయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలకు తెర పడుతుందన్న ఆశాభావాన్ని ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ సోమవారం పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ యాదవ్ మాట్లాడుతూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని మధ్యప్రదేశ్ నుంచే రాజ్యసభకు ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు.
*చిత్రం...పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ