జాతీయ వార్తలు

ఇదో మహమ్మారి.. జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని హడలె త్తిస్తున్న కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది. కరోనా వైరస్ రోజు, రోజుకు విస్తరిస్తూ తన విశృంఖలత్వాన్ని ప్రకటించుకుంటున్నందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించింది. కరోనా వైరస్ విషయంలో మేము ప్రమాద ఘంటికలను అతి బిగ్గరగా, స్పష్టంగా మోగించాము, ఇక జాగ్రత్తపడవలసింది ప్రపంచ దేశాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ తెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసుస్‌గా గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రపంచ దేశాల నాయకులు చిత్తశుద్దితో గట్టి చర్యలు తీసుకుంటే కరోనా వైరస్‌ను అదుపు చేయవచ్చునని ఆయన చెప్పా రు. అయితే, కొన్ని దేశాల నాయకులు కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశాల అధినేతలు కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు గట్టి చర్యల తీసుకోవటం లేదని తెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసుస్ విమర్శించారు. కరోనా వైరస్ మూలంగా వ్యాపార సంస్థలు మూతపడుతున్నాయి, ఆటల పోటీలు ఆగిపోతున్నాయి, ఆర్థిక, సామాజిక, వ్యాపార, వాణిజ్య సంబంధమైన ప్రపంచ స్థాయి సమావేశాలు రద్దవుతున్నాయి. పలు ఐరోపా దేశాల విమాన సర్వీసులను అమెరికా నిషేధించటంతో విమానయాన సంస్థలు దిక్కుదోచని స్థితిలో పడిపోయాయి. పర్యాటక రంగం కుదేలైంది. పర్యాటక రంగం భారీగా దెబ్బతినటంతో హోటల్ పరిశ్రమ దివాళా తీసే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. సౌదీ అరేబియా తదితర ఇస్లామిక్ దేశాలు ఇతర దేశాల వారిని తమ దేశంలోకి రానివ్వటం లేదు. భారతదేశం కూడా విజిటర్స్ వీసాలను రద్దు చేసింది. దీనితో ప్రపంచ స్థాయిలో భయానక వాతావరణం నెలకొంటొంది. కరోనా వైరస్ పలు దేశాలకు వ్యాపించటం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర భయాందోళనను వ్యక్తం చేసింది. చైనాలో లక్షలాది మందికి సోకి వేలాది మందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ ప్రస్తుతం 114 దేశాలకు విస్తరించి 4,291 మందిని తన పొట్టన పెట్టుకున్నదనీ, లక్షా 18 వేల మందికి సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రపంచంలోని ప్రతి దేశానికి స్పష్టమైన సూచనలు చేశామని ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రధానాధికారి తెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ తెలిపారు. కరోనా వైరస్ 115 దేశాలకు వ్యాపించి 1,25,293 మందికి సోకటంతోపాటు 4,600 మందిని పొట్టన పెట్టుకున్నది ఏ.ఎఫ్.పి ప్రకటించింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు తాము చేయగలిగినదంతా చేస్తామని ఐరోపా దేశాల యూనియన్ ప్రకటించింది. కరోనా వైరస్ అమెరికాలో విస్తరించటం కొనసాగుతోంది. అమెరికాలోని హార్వార్డ్, కెంబ్రిడ్జ్ తదితర విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులను ఇళ్లకు పంపించివేస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత కాలేజీలకు రావాలని ఆయా విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులకు సూచిస్తున్నాయి. కరోనా వైరస్ తాజాగా బొలీవియా, హోండరస్, టర్కీ దేశాలలో దర్శనమిచ్చింది. బర్గేలియా, స్వీడన్ దేశాల్లో కరోనా వైరస్ మొదటి మరణాలు సంభవించటంతో ఆ దేశాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వివిధ దేశాలో కరోనా వైరస్ సోకిన వారు ఇంత వరకు దాదాపు 66వేల మంది ఆరోగ్యవంతులయ్యారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించటం గమనార్హం. పలు కొత్త దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలోని ప్రతి ప్రాంతానికి వ్యాపించిన కరోనా... వైరస్ కొరియా, ఇరాన్, ఇటలీ తదితర దేశాలను సైతం తన గుప్పిట్లో బంధించటం తెలిసిందే.

*చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ తెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసుస్