జాతీయ వార్తలు

ఢిల్లీలో మూతబడ్డ స్కూళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని స్కూళ్లు, కాలేజీలు ఇతర విద్యా సంస్థలు సినిమా హాళ్లను ఈనెల 31వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. ఢిల్లీలోని అన్ని సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు ఈనెల 31వ తేదీ వరకు మూసి ఉంచాలని ఆయన ఆయా యాజమాన్యాలకు స్పష్టం చేశారు. కరోనా కేసులు దేశంలో 73కు చేరడంతో దేశమంతటా అన్ని ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంటున్నాయి. అత్యధికంగా కేరళలో 17 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో కరోనా అనుమానిత రోగి మంగళవారం అర్ధరాత్రి మృతి చెందడం కర్నాటకను ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్టల్రో పది కేసులు నమోదయ్యాయి. అక్కడి ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈనెల 29న ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాయిదా వేయాల్సిందిగా బాంబే, ఢిల్లీ హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌లు దాఖలయ్యాయి. కరోనా భయం కారణంగానే భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండు వనే్డ ఇంటర్నేషనల్స్ ప్రేక్షకుల్లేకుండానే జరిగే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రులెవరూ రాబోయే రోజుల్లో విదేశీ పర్యటనకు వెళ్లవద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు.