జాతీయ వార్తలు

ఎన్‌పీఆర్‌లో పత్రాల అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: ఎన్.పీ.ఆర్ ప్రక్రియ సందర్భంగా ప్రజల నుండి ఎలాంటి పత్రాలను కోరటం జరగదని అమిత్ షా సభలో స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పీ.ఆర్, ఎన్.ఆర్.సీ విషయంలో అసత్యాల ప్రచారం ఆపవలసిన సమయం వచ్చిందని అమిత్ షా స్పష్టం చేశారు. వీటి గురించి ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులతో చర్చించేందుకు తాను సిద్దమేనని ఆయన తెలిపారు. ప్రజలు తమకు ఇష్టం ఉన్నంత సమాచారం ఇవ్వవచ్చు, ఇష్టం లేకపోతే సమాచారం ఇవ్వకుండా ఉండవచ్చునని ఆయన తెలిపారు. ఎన్.పీ.ఆర్‌లో ఎలాంటి పత్రాలు అడగటం జరగదని పలు మార్లు స్పష్టం చేశామని ఆయన అన్నారు. మీకు ఇష్టమున్నంత సమాచారం ఇవ్వవచ్చునని చెప్పామన్నారు. ఎన్.పీ.ఆర్‌లో ‘డి’ అనేదే ఉండదు, దీని గురించి ఎవ్వరికి ఎలాంటి భయం ఉండవలసిన అవసరం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా తన వద్దకు వస్తే చర్చించేందుకు సిద్దమేనని ఆయన ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో చెప్పారు. గులాం నబీ ఆజాద్ అడిగిన వెంటనే సమయం కేటాయించి వారి అనుమానాలు తీరుస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం మూలంగా ముస్లింల పౌరసత్వం పోతుందనటం అసత్యమన్నారు. ఇది కేవలం ప్రతిపక్షాల అభూత కల్పన అని అన్నారు.