జాతీయ వార్తలు

విదేశీ ప్రయాణాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైరస్ వ్యాపించకుండా చూసేందుకు ప్రయాణాలు, పర్యటనలు, పెద్ద, పెద్ద సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలకు హితవు చెప్పారు. దేశ ప్రజలందరి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. వైద్య, ఆరోగ్య సేవలను మరింత పటిష్టం చేయటం, ఔషధాలను అందుబాటులో పెట్టటంతోపాటు విదేశీయుల రాకను అరికట్టేందుకు వీసాల రద్దు వంటి పలు చర్యలు తీసుకుంటున్నామని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర మంత్రులు కొంత కాలం పాటు విదేశీ పర్యటనలకు వెళ్లరని ఆయన చెప్పారు. అవసరం లేని ప్రయాణాలు, పర్యటనలు చేయవద్దు,
పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని ఆయన గురువారం పలు ట్వీట్ల ద్వారా ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ భయాందోళనకు ‘నో’ చెప్పాలి, ముందు జాగ్రత్తలకు ‘యస్’ చెప్పాలని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. పర్యటనలు, ప్రయాణాలు, సభలు, సమావేశాలు, సమూహాల కలయిక లేకుండా చేయటం ద్వారా కరోనా వైరస్ విస్తరించకుండా అదుపు చేయవచ్చునని మోదీ తెలిపారు.
హర్షవర్దన్ పిలుపు
కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు దాదాపు 35వేల మంది సామాజిక నిఘా కార్యక్రమంలో పనిచేస్తున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. హర్షవర్దన్ గురువారం లోక్‌సభలో కరోనా వైరస్‌పై జరిగిన చర్చకు బదులిస్తూ ఈ విషయం వెళ్లడించారు. కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు పార్లమెంటు సభ్యులంతా తమ నియోజకవర్గాల్లో తగు చర్యలు తీసుకోవాలని హర్షవర్దన్ పిలుపు ఇచ్చారు. పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో ప్రజలను జాగృతం చేసేందుకు కృషి చేయాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా చూసేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని ఆయన ఎంపీలకు సూచించారు. కరోనా వైరస్ సోకినవారందరి వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హర్షవర్దన్ చెప్పారు. కరోనా వైరస్ సోకిన వారి పూర్వపరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా వైరస్ స్క్రీనింగ్‌లో ఎలాంటి లోపాలు లేకుండా చూస్తున్నాము, ఈ విషయంలో ఎవరికి ఎలాంటి భయాంధోళనలు ఉండవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గత జనవరిలో కేవలం ఏడు పెద్ద విమానాశ్రయాలలో కరోనా వైరస్ స్క్రీనింగ్ చేస్తే ఇప్పుడు 30 విమానాశ్రయాలలో కరోనా వైరస్ స్క్రీనింగ్ జరుగుతోందని హర్షవర్దన్ వెళ్లడించారు. అన్ని ఫ్లైట్లకు చెందిన అందరు ప్రయాణికులను స్క్రీన్ చేస్తున్నాము, ఎవ్వరిని వదలటం లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ గురించి అన్ని ల్యాబ్‌లలో పరీక్షలు జరపలేదు, ప్రత్యేక ల్యాబ్‌లలో మాత్రమే ఇది సాధ్యమవుతుందంటూ ప్రస్తుతం 51 ల్యాబ్‌లు 56 సాంపిల్ సేకరణ కేంద్రాలు కరోనా వైరస్‌పై పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ లెక్కన మొత్తం వంద సమన్వయ కేంద్రాలు కరోనా వైరస్‌పై పని చేస్తున్నాయని హర్షవర్దన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైంటిస్టులు, వైద్యులతో కూడిన ఒక ప్రత్యేక బృందంతోపాటు ఔషధాలను ఇరాన్ దేశానికి పంపించామని మంత్రి సభకు తెలిపారు. కరోనా వైరస్‌కు గురైన భారతీయ పౌరులు మొదట చైనాలోని వుహాన్, జపాన్ నుండి తీసుకువచ్చాము, ఇప్పుడు ఇరాన్ నుండి కూడా తెస్తున్నామని హర్షవర్దన్ తెలిపారు. తమ నియోజకవర్గాల్లో పెద్ద,పద్ద సభలు, సమావేశాలు జరుగకుండా చూడాలని ఆయన పార్లమెంటు సభ్యులకు సూచించారు. కరోనా వైరస్ మూలంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులందరిని స్వదేశానికి తీసుకురావటం తమ బాద్యత అని ఆయన అన్నారు.

*చిత్రం... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ