జాతీయ వార్తలు

వెళ్లిన వారు తిరిగొస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలపై చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఘాటుగా స్పందించారు. ‘కాంగ్రెస్‌ను తిట్టుకుంటూ, ఆగ్రహంతో బయటకు వెళ్లిన వారు నిశ్శబ్దంగా తిరిగి పార్టీలోకి వస్తారు’అని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి బయలుదేరే ముందు స్వామి వివేకానంద విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మీడియాతో ముచ్చటించారు. కమల్‌నాథ్ నాయకత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఢోకాలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సింధియా రాజీనామా విషయం ఆయన దృష్టికి తీసుకురాగా హిందీలో ఓ పద్యం వినిపించారు. ‘కుచ్ తో మజ్‌బూరియన్ రహీ హోంగి. వర్నా కోయి యెన్ హీ బెవఫా తోడే హోతా హై’అని అన్నారు. ఎవరి బలవంతంతోనేనే అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, కారణం లేకుండా ఎవరూ అవిధేయులుగా మారరు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎందరో కాంగ్రెస్ పార్టీని వీడిన వారిని తాము చూశామని, వాళ్లే చడీచప్పుడు లేకుండా తిరిగి పార్టీలోకి తిరిగి వచ్చారని బఘేల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి అనేక సంఘటలు జరిగాయని సీఎం పేర్కొన్నారు. ఆగ్రహంతోనో మరోకారణంతోనే పార్టీని వీడడం, వాళ్లే కొన్నాళ్లుపోయాక తిరిగి పార్టీలోకి రావడం జరిగిందని ఆయన వివరించారు. గురువారం జరిగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ హాజరవుతారని ఆయన వెల్లడించారు. కమల్‌నాథ్ ప్రభుత్వం ఐదేళ్లూ పరిపాలిస్తుందని చత్తీస్‌గఢ్ సీఎం ధీమా వ్యక్తం చేశారు. శాసన సభ బలపరీక్షలో కమల్‌నాథ్ విజ యం సాధిస్తారని ఆయన అన్నారు. ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలో ఉన్నదీ తేలిపోతుందని ఆయన స్పష్టం చేశారు. బలపరీక్షలో కమల్‌నాథ్ సర్కార్ గట్టెక్కుతుందని ఆయన జోస్యం చెప్పారు. తన ఢిల్లీ పర్యటన గురించి బఘేల్ మాట్లాడుతూ చత్తీస్‌గఢ్ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల అభ్యర్థు గురించి అధిష్ఠానంతో మాట్లాడతానని తెలిపారు. ‘ఈనెల 26న రాజ్యసభ ఎన్నికలున్నాయి. నామినేషన్లు దాఖలుకు గడువు13. ఎవర్ని నిలబెట్టాలన్నదానిపై మా పార్టీ అధినాయకత్వంతో మాట్లాడతా’అని ఆయన అన్నారు. రాష్ట్రం నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యులున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా, బీజేపీ నేత రణ్‌విజయ్ ప్రతాప్ సింగ్ జుడె యో గడువుఈనెలాఖరుతో ముగియనుంది. సరోజ్‌పాండే, రామ్‌విచార్ నేతం(బీజేపీ), ఛాయా వర్మ (కాంగ్రెస్) రాజ్యసభ సభ్యులుగా ఉంటారు. కాగా 90 స్థానాలున్న చత్తీస్‌గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 69 మంది, బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్(జే) కు ఐదు, బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి రెండు స్థానాలున్నాయి. సంఖ్య చూస్తే రెండు రాజ్యసభ స్థానాలూ అధికార కాంగ్రెస్‌కే దక్కే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని బీజేపీ ఇంతకు ముందే ప్రకటించింది.