జాతీయ వార్తలు

ఆయన మాటలే వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుమారు 18 సంవత్సరాలు తమ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ తప్పుబట్టారు. రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలతోనే ఆయన పార్టీ మారారని వ్యాఖ్యానించారు. ‘జ్యోతిరాదిత్య మాటలకు, చేష్టలకు సంబంధం లేదు.. ఆయన మాటలే వేరుగా ఉన్నాయి.. మనసులో మరేదో ఉద్దేశం ఉంది’ అని రాహుల్ అన్నారు. కాలేజీ రోజుల నుంచి జ్యోతిరాదిత్యతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, 18ఏళ్లు ఆయన కాంగ్రెస్‌లో పనిచేశారని రాహుల్ గుర్తు చేశారు. ఇది సైద్ధాంతికపరమైన అంశమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఒక వైపు, బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్ మరోవైపు ఉన్నాయని అంటూ జ్యోతిరాదిత్య ఆలోచనా విధానం, సిద్ధాంతాలు తనకు బాగా తెలుసని అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ఆయన తన సిద్ధాంతాలను బీజేపీకి పణంగా పెట్టారని విమర్శించారు. నిజానికి జ్యోతిరాదిత్య ఆ పార్టీలో తగినంత గౌరవం కానీ, గుర్తింపు కానీ లభించవని జోస్యం చెప్పారు. సింధియా వ్యవహార శైలి తనకు తెలుసు కాబట్టి ఆయన బీజేపీలో మనగలగడం అనుమానేనని అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోసం ఎంతగా ఫలితం లేకపోవడం వల్లనే తాను ఈ నిర్ణయం తీసుకొన్నట్లు జ్యోతిరాదిత్య బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఆయన ప్రకటనను రాహుల్ ఖండించారు. తాను సామాన్యమైన నాయకుడిని మాత్రమేనని, తనను ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చని పేర్కొన్నారు.
గాఢనిద్రలో ప్రభుత్వం
కేంద్రంలోని మోదీ సర్కారు గాఢనిద్రలో ఉందని, అందుకే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వంటి అంశాలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు.

*చిత్రం...కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ