జాతీయ వార్తలు

కరోనా ఎఫెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 12: భారత్‌లో సైతం కరోనా ప్రభావంపై ఆందోళన తీవ్రవౌతున్న సందర్భంగా ముంబయిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ఐసొలేషన్ వార్డులతో పాటు కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాక్రే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు కేంద్రం నుంచి గుర్తింపు రావాల్సి ఉంటుందని సీనియర్ అధికారులు ముంబయిలో స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, డిప్యూటీ సీఎం అజిత్‌పవార్, ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె, సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. ‘కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు మార్గాలను అనే్వషిస్తోంది.. ఇందులో భాగంగా ముంబయిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు, కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.. దీనికి సంబంధించి కేంద్రం నుంచి గుర్తింపు (అక్రిడిటేషన్) రావాల్సి ఉంటుందని’ సమావేశంలో పాల్గొన్న సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. విమానాశ్రయాలకు వచ్చే వారికి ఇతరత్రా ఆనారోగ్యం సంభవించకుండా ఉండేందుకు అవసరమైన వైద్యులు, నర్సులను అదనంగా నియమించినట్లు పేర్కొన్నారు. ‘కరోనా పరీక్షా కేంద్రాల ఏర్పాటు అత్యవసరం.. ఎందుకంటే పూణెలోని వైరాలజీ కేంద్రంపై వత్తిడి విపరీతంగా ఉంది.. అందువల్లే ప్రత్యామ్నాయంగా అధునాతన పరికరాలతో కూడిన పరీక్షా కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అని స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా స్క్రీనింగ్ పరీక్షలపై వివరణ కోరగా.. ఇక్కడ సదుపాయాలను మరింత ఆధునీకరించాల్సి ఉంది అని స్పష్టం చేశారు. ముంబయిలోని ప్రధాన జస్లోక్, లీలావతి, నానావతి, హిందూజా ఆసుపత్రుల ప్రతినిధులు సీఎంతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.