జాతీయ వార్తలు

ఫరూక్ అబ్దుల్లాతో గులాంనబీ ఆజాద్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 14: ఏడు నెలల తరువాత గృహ నిర్బంధం నుంచి విడుదలయిన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ శనివారం కలుసుకున్నారు. నిర్బంధంలో ఉన్న జమ్మూకాశ్మీర్ నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆజాద్ శనివారం మధ్యాహ్నం శ్రీనగర్‌లోని గుప్కర్ ప్రాంతంలో గల ఫరూక్ అబ్దుల్లా నివాసానికి వెళ్లి ఆయనతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ పురోగతి కోసం దాని నాయకులను విడుదల చేసి తీరాలని అన్నారు. జమ్మూకాశ్మీర్ నాయకులను పంజరంలో చిలుకలను బంధించినట్టు నిర్బంధించరాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన ఆజాద్ పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా ఇతర నాయకులు, వ్యక్తులు అందరినీ వెంటనే విడుదల చేయాలని, జమ్మూకాశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియను పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఆర్థిక మంత్రి అల్త్ఫా బుఖారీ ఇటీవల ప్రారంభించిన జమ్మూకాశ్మీర్ అప్‌నీ పార్టీ (జేకేఏపీ)ని ఆజాద్ తోసిపుచ్చారు. జమ్మూకాశ్మీర్ ‘ఏజెన్సీ సృష్టించిన పార్టీల’ ద్వారా నడవజాలదని ఆయన పేర్కొన్నారు.
*చిత్రం... శ్రీనగర్‌లో శనివారం మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్