జాతీయ వార్తలు

కరోనాపై సార్క్ పిడికిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: రోజురోజుకూ జఠిలంగా మారుతున్న కరోనా వైరస్‌పై సార్క్ దేశాలు సంయుక్తంగా సమర శంఖం పూరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం సార్క్ సభ్య దేశాలను ఉద్దేశించి వీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన ఈ వైరస్‌పై పోరాటానికి ‘కోవిడ్-19 ఎమర్జెన్సీ నిధి’ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం భారత్ తరఫున 10 మిలియన్ డాలర్లను ప్రారంభంగా అందిస్తామని ప్రకటించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే సార్క్ దేశాలన్నీ చేతులు కలపాల్సిందేనని, వ్యక్తిగతంగా నిరోధన సాధ్యం కాదని ఉద్ఘాటించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీతోపాటు లంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భూటాన్ ప్రధాని లోటే షరింగ్, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, అఫ్గాన్ అధ్యక్షుడు అస్రాఫ్ ఘనీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సలహాదారు జఫర్ మీర్జా పాల్గొన్నారు. సార్క్ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందని, ఆ ఉమ్మడి చర్యల ద్వారానే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు అణచివేయడమూ సాధ్యమవుతుందని మోదీ తెలిపారు. గందరగోళం లేకుండా సార్క్ దేశాలన్నీ సహకరించుకోవాలని, భయపడకుండా ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని మోదీ ఉద్ఘాటించారు. ఈ చర్చ సందర్భంగా మోదీ చేసిన సూచనలు, ప్రతిపాదనలకు సభ్యదేశాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్-19
అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని, ఇందుకు సభ్యదేశాలన్నీ స్వచ్ఛందంగానే తమ వంతు విరాళాన్ని అందించాలని మోదీ కోరారు. భారతదేశంలో కరోనాపై పోరుకు వైద్యులు, నిపుణులతో తక్షణ చర్యల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అలాగే, ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన వైద్య పరికరాలన్నింటినీ అందుబాటులో ఉంచామని అన్నారు. అవసరమైతే ఈ బృందాలను, పరికరాలను సార్క్ దేశాలకూ తరలించడానికి సుముఖంగా ఉన్నామని మోదీ తెలిపారు. వైరస్ ఉన్న వ్యక్తులను గుర్తించడానికి వీలుగా వ్యాధి నియంత్రణ పోర్టల్‌ను కూడా భారత్ ఏర్పాటు చేసిందని, వైరస్ ఉన్న వ్యక్తులు ఎవరెవరిని కలుసుకున్నారో గుర్తించడానికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను సార్క్ భాగస్వామ్య దేశాలకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మోదీ అన్నారు. దక్షిణాసియా ప్రాంతంలో ఈరకమైన అంటువ్యాధులపై పరిశోధన జరిపి, వాటిని నిరోధించేందుకు సంయుక్తంగా ఓ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అవసరమైన సహాయాన్ని అందిస్తుందని మోదీ తెలిపారు. మిగతా దేశాలతో పోలిస్తే దక్షిణాసియా ప్రాంతంలో 150 కంటే తక్కువే కరోనా కేసులు నమోదయ్యాయని, అయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ‘్భయపడకండి.. సన్నద్ధంకండి’ అన్నదే కరోనాపై యుద్ధానికి భారత్ తారకమంత్రమని మోదీ తెలిపారు. భారత్‌లోకి ప్రవేశించే ప్రతిఒక్కరి స్క్రీనింగ్‌ను జనవరిలోనే మొదలుపెట్టామని, అనంతరం క్రమంగా పర్యటనలపై ఆంక్షలు విధించామని, ఒక క్రమానుగతంగా చర్యలు తీసుకోవడం వల్ల జనంలో భయం పోగొట్టామని, అన్నివర్గాలకు వైద్య సౌకర్యాలు అందించామని తెలిపారు. ఇతర దేశాల్లోని దాదాపు 1,400 మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చామని, అలాగే ఇతర దేశస్థులను అక్కడి నుంచి తరలించామని మోదీ తెలిపారు.
కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు సభ్యదేశాలు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని లంక అధ్యక్షుడు రాజపక్స కోరారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు మోదీ చేసిన ప్రతిపాదనలు హర్షణీయమని, ఈ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని బంగ్లా ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. ఉమ్మడి చర్యల ద్వారానే కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని నేపాల్ ప్రధాని ఓలీ అన్నారు. విభేదాలకు అతీతంగా సార్క్ దేశాలు కలిసి పనిచేయాలని భూటాన్ ప్రధాని లోటే షరన్ కోరారు. కరోనా మహమ్మారిపై సమైక్యంగా పోరు సాగించాలన్న సందేశాన్ని అందించడమే ఈ వీడియో కాన్ఫరెన్స్ లక్ష్యమైనప్పటికీ దీనిని కూడా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు పాకిస్తాన్ వాడుకుంది. కరోనా వైరస్ ముప్పును ఎదుర్కోవాలంటే కాశ్మీర్‌లో ఆంక్షలను ఎత్తివేయాలని పాకిస్తాన్ ప్రతినిధి మీర్జా ఈ సందర్భంగా స్పష్టం చేయడం గమనార్హం.

*చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ