జాతీయ వార్తలు

అర్ఫా, రోహిణిలకు చమేలి దేవి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: జర్నలిజంలో విశేష ప్రతిభ కనబరచిన మహిళా జర్నలిస్టులకు ఇచ్చే చమేలి దేవి జైన్ అవార్డును అర్ఫా ఖానుమ్ షేర్వాని, రోహిణి మోహన్ అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఈ సంవత్సరం సంయుక్తంగా సాధించుకున్నారు. షేర్వాని ‘ద వైర్’ కోసం పనిచేస్తుండగా, బెంగళూరుకు చెందిన రోహిణి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. చెన్నైకి చెందిన ఇండిపెండెంట్ డాటా-జర్నలిస్టు రుక్మిణి ఎస్ ‘హానరేబుల్ మెన్షన్’ను పొందారు. ఏడాదికోసారి ప్రదానం చేసే ఈ అవార్డు కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రింట్, బ్రాడ్‌కాస్ట్, ఆన్‌లైన్ మీడియా నుంచి వచ్చిన 40కి పైగా ఎంట్రీల నుంచి సామాజిక స్పృహ, అంకితభావం, ధైర్యం వంటి అంశాల ప్రాతిపదికన విజేతలను గుర్తించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజనీతి శాస్తజ్ఞ్రుడు జోహా హసన్, జర్నలిస్టులు శ్రీనివాసన్ జైన్, మనోజ్ మిట్ట జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు.