జాతీయ వార్తలు

దేశంలో వైరస్ కేసులు 84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 84కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ వైరస్ సోకినట్టుగా ఆసుపత్రుల్లో చేరిన ఏడుగురిని పరీక్షల అనంతరం డిశ్చార్జి చేసినట్టు తెలిపింది. వీరిలో ఐదుగురు యూపీకి చెందినవారు కాగా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరు ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు ఢిల్లీలో ఆరు, యూపీలో 11, కర్నాటకలో ఆరు, మహారాష్టల్రో 14,లడఖ్‌లో మూడు, జమ్మూకాశ్మీర్‌లో రెండు వైరస్ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. అలాగే రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్టు తెలిపారు. తాజాగా 17 మంది విదేశీయులు సహా దేశంలో 84 నిర్ధారిత కరోనా కేసులు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ కుమార్ వివరించారు. ఈ వైరస్ సోకిన వారితో కలిసి ఉన్నట్టుగా భావిస్తున్న నాలుగు వేల మందిని పైగా గుర్తించామని, వీరిపై నిఘా పెట్టామని తెలిపారు. వైరస్ సోకిన వారిని కలుసుకున్నా కూడా క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టపడని వారి సంఖ్య ఎక్కువగానే ఉందని అన్నారు. ఇరాన్ నుంచి భారతీయ ప్రయాణికులతో మహన్ విమానం ఏ క్షణంలోనైనా ముంబయికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, భారతీయ విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఇటలీలోని మిలన్‌కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపుతున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలను అత్యంత కట్టుదిట్టమైన రీతిలో చేపడుతున్నామని, తగిన సంఖ్యలో వైద్యులను, సిబ్బందిని, అత్యవసర బృందాలను సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. వైరస్ వ్యాప్తి తీవ్రత కారణంగా మాస్క్‌లు, శానిటైజర్లలను అత్యవసర వస్తువులు గా నిత్యావసర వస్తువుల చట్టం కింద ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా వీటి బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసింది. జూన్ చివరి వరకు ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపారు. కరోనా వైరస్ ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థగా ప్రకటించినప్పటికీ ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య మం త్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వైరస్ వ్యాపించిన కేసులు స్వల్పంగా ఉన్నాయని, మూకుమ్మడిగా ఇది వ్యాపించే అవకాశాలు లేవని స్పష్టం చేసింది.