జాతీయ వార్తలు

కరోనా ఎఫెక్ట్..‘పద్మ’ అవార్డుల వేడుక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: కరోనా ప్రభావం అన్నింటిపైనా పడింది. ఈనెల 26, ఏప్రిల్ 3న జరగాల్సిన పద్మ అవార్డుల వేడుకలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ కింద మూడు కేటగిరిల్లో అవార్డులు ఇస్తారు. ముందు నిర్ణయించిన ప్రకారం మార్చి 26, ఏప్రిల్ 3న పద్మ అవార్డుల ప్రదానం జరగాలి. అయితే దేశ వ్యాప్తంగా కుదిపేస్తున్న కరోనా వైరస్ వల్ల వేడుకలు వాయిదా వేసినట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు పద్మ అవార్డులు ప్రకటిస్తారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ, సేవలందించిన వ్యక్తులకు పురస్కారాలు ఇస్తారు. ఈ ఏడాది రాష్టప్రతి 141 అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఏడు పద్మ విభూషణ్, 16 పద్మ భూషణ్, 118 పద్మశ్రీలు. ఈసారి పద్మ విభూషణ్ అవార్డులు మాజీ కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, జార్జి ఫెర్నాండెజ్(చనిపోయిన తరువాత)కు ప్రకటించారు. అలాగే దివంగత మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్, మాజీ గవర్నర్ ఎస్‌సీ జమీర్‌కు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించారు. కళలు, సామాజిక సేవ, ప్రజా సేవ, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు తదితర రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ఈ అత్యున్నత పద్మ పురస్కారాలు అందిస్తారు. రాష్టప్రతి భవన్‌లో జరిగే వేడుకల్లో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. ఈసారి కరోనా ప్రభావం వల్ల వేడుకలు వాయిదా వేశారు.