జాతీయ వార్తలు

హోం క్వారంటైన్’లను గుర్తిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పేర్కొన్నారు. నిపుణుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తులను ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పారు. ‘కరోనా లక్షణాలున్న వ్యక్తులెవరైనా మీ సమీపంలో ఉంటే అలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దనీ.. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి’ అని ప్రజలకు సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
జనతా కర్ఫ్యూ తొమ్మిది గంటల వరకే అని ఎవరూ భావించవద్దనీ.. మరికొన్ని రోజులు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ‘ప్రభుత్వం హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వారిని గుర్తిస్తూనే ఉంది.. మీ సమీప ప్రాంతాల్లో ఎవరైనా కరోనా లక్షణాలతో ఉంటే అలాంటి కుటుంబాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా సమాచారం అందించండి.. ఆ పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలంటే మీ సహకారం తప్పనిసరి.. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని పిలుపునిచ్చారు. ‘ప్రధాన మంత్రి జనతా కర్ఫ్యూను ప్రకటించారు.. మేమంతా పాటించాం.. ఇది ఈ ఒక్కరోజు తొమ్మిది గంటల వరకు మాత్రమే అనుకోవద్దు.. మరికొంతకాలం ఇళ్లకే పరిమితం కావాలి’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆదివారానికి భారత్‌లో 341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయనీ.. కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.. కేవలం ఒక్క వారం రోజుల వ్యవధిలోనే సంఖ్య రెట్టింపు కావడం శోచనీయం అన్నారు. అలా అని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున నుంచి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీని ఇంతవరకు లాక్‌డౌన్ చేయలేదనీ.. కరోనా మహమ్మారి దృష్ట్యా అవసరమైతే చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
*చిత్రం... ఢిల్లీ సీఎం కేజ్రీవాల్