S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/07/2020 - 23:35

పి రామకృష్ణ దర్శకత్వంలో భరణీ సంస్థ నుంచి వెలువడిన ఆరో సినిమా -విప్రనారాయణ (1954). వైజయంతీ విలాసం, విప్రనారాయణ చరిత్ర కావ్యాల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. విప్రనారాయణునిగా అక్కినేని అసమాన నటన ప్రదర్శించిన చిత్రమిది. ఈ చిత్రం నిర్మితమవుతున్న టైంలోనే.. కెవి రెడ్డి ‘దొంగరాముడు’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఓ సందర్భంలో అక్కినేనితో కెవి రెడ్డి ‘నీకు దేవుడిమీద నమ్మకం లేదు. ఇదేమో పరమభక్తుడి పాత్ర.

03/07/2020 - 23:28

చిన్ని బ్రదర్స్ పతాకంపై అంజలీదేవి అద్భుతంగా రూపొందించిన అలనాటి చిత్రం -సతీసుమతి. కథానాయికగా అంజలీదేవే నటించి మెప్పించారు. సంగీత దర్శకుడు ఆదినారాయణరావు చేసిన బాణీలన్నీ అద్భుతాలే. సీనియర్ సముద్రాల రచించిన వేదాల నీతిసారం ఒక పాటలో పొందుపర్చారు. ‘మీ దానం మీ ధర్మం నిరుపేదల జీవాధారం’ అంటూ సాగే ఆ పాటలో ముక్తికి ధర్మమే ప్రధాన మార్గమని సూచించారు.

03/07/2020 - 23:26

వెంకటేష్, పవన్‌కల్యాణ్ కలిసి నటించిన మల్టీస్టారర్ -గోపాల గోపాల. కిశోర్‌కుమార్ పార్థసాని దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో శ్రీయా శరణ్, మిథున్ చక్రవర్తి, కృష్ణుడు, ఆశీష్ విద్యార్థి, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి నటించి మెప్పించారు. హిందీలో విజయవంతమైన ‘ఓ మై గాడ్’ చిత్రానికి రీమేక్‌గా తయారైన ఈ సినిమా తెలుగు ప్రజలనూ అలరించింది.

02/29/2020 - 22:30

పల్లెటూళ్లో సాగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ -ఓ పిట్ట కథ. భవ్య క్రియేషన్స్‌పై వి ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తోన్న సినిమాతో నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌రావు హీరోగా, చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశ్వంత్ దుద్దుంపూడి మరో హీరో. నిత్యాశెట్టి హీరోయిన్. మార్చి 6న సినిమా విడుదలవుతోన్న సందర్భంలో హీరో సంజయ్‌రావు మీడియాతో ముచ్చటించాడు.

02/29/2020 - 22:28

యూత్‌ని ఎట్రాక్ట్ చేయడానికి సహజత్వంతో వస్తోన్న చిత్రం -మిస్టర్ అండ్ మిస్. డేటింగ్‌లు, వీడియో చాటింగ్‌లు ప్రేమలో భాగమైన ఈ జనరేషన్ ప్రేమకథగా రూపొందింది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

02/29/2020 - 22:26

తెలుగులో తొలిసారి దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావు పరిచయమైన చిత్రం -అమర సందేశం. హిందీలో విజయవంతమైన బైజూ బావారా చిత్రానికి రీమేక్‌గా దీన్ని రూపొందించారు. కథానాయకుడు అమరనాథ్. జూ.శ్రీరంజని, పద్మిని, రేలంగి, తుర్లపాటి విజయలక్ష్మి, మాస్టర్ మోహన్, మిక్కిలినేని, కెవిఎస్ శర్మలాంటి ఉద్దండ నటులు నటించిన చిత్రంలో అద్భుతమైన పాట -మధురం మధురం మనోహరం. ఈ చిత్రంలో పది పాటలున్నాయి.

02/29/2020 - 22:25

రంగమ్మకున్న ఆస్తి -మెతక మొగుడు, సవతికొడుకు, సొంత కూతురు. పట్నంలో చదువుకుంటూ కృష్ణ -అంజలీదేవి లాంటి రాధను ప్రేమిస్తాడు. రాధ పేదది కావడంవల్ల.. రంగమ్మ అడిగిన కట్నం ఇవ్వలేకపోతుంది. రాధ తండ్రి -రామయ్య అనే ఆయన దగ్గర అప్పుచేస్తాడు. కానీ ఇచ్చిన డబ్బును రామయ్య కాజేస్తాడు. దాంతో కృష్ణ తెగించి రాధను పెళ్లి చేసుకొని వేరు వెళ్తాడు. ఇంతలో రేలంగి..

02/22/2020 - 22:42

రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా జోడీగా మా ఆయి ప్రొడక్షన్స్‌పై దర్శకుడు శివకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం -22. సుశీలాదేవి నిర్మించిన చిత్రం నుంచి తొలి సింగిల్ ‘మార్ మార్ కే’ను హీరో ప్రభాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గీత రచయిత కాసర్ల శ్యామ్ -వైవిధ్యమైన పాట రాసే అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

02/22/2020 - 22:40

ప్రతి సంగీత దర్శకుడి వద్దా ఏదోక సినిమా దొరుకుతూనే ఉంటుంది. ఏదోక సినిమాతో మంచి పేరు రావడమూ జరుగుతుంటుంది. కానీ -ఒక్కొక్కరికి ఒక్కోసారి అద్భుతమైన విజయం దక్కుతుంది. ఆ అద్భుతం దక్కాలంటే -కానె్సప్ట్ బావుండాలి. హిట్ రేంజ్‌కి తీసుకెళ్లే హీరోపడాలి. సంగీత దర్శకుడికి అలాంటి అద్భుతం దక్కడానికి ఓ టైముంటుంది. అది వచ్చేవరకూ వెయిట్ చేయడమే -అంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్.

02/22/2020 - 22:38

అలనాటి జానపద చిత్రాల్లో లక్ష్మీకటాక్షం ప్రేక్షకుల విశేష అభిమానం పొందడం మాత్రమేకాక, నిర్మాతలకు ధనరాసులు కురిపించింది. ఈ చిత్రానికి ప్రధాన కేంద్ర బిందువు లక్ష్మీభాండారం. ఇది ఒక వజ్ర వైఢూర్య సువర్ణ నిధి. కోదండపాణేశ్వరుడు (మిక్కిలినేని) గురువు. ఈయన శిష్యులే ప్రచండుడు, వినయానందుడు. వినయానందుడు ఈ నిధిని సర్వజనుల సంక్షేమానికి ఉపయోగించాలని ఆలోచించగా, ప్రచండుడు స్వార్థ ప్రయోజనానికి వాడుకోవాలనుకుంటాడు.

Pages