Others

నంథుని చరితము..(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఒకానొక అద్భుత చిత్రం -జయభేరి. అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, గుమ్మడి, శాంతకుమారి, రాజసులోచనలాంటి ఉద్ధండ నటీమణులు నటించిన ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఒక పాట అనలేం కానీ అన్ని పాటలు ఆ సినిమాలో అద్భుతాలే. ఘంటసాల సోలోగా పాడిన ఆ పాట ఇప్పటికీ చెవులలో వినిపిస్తూనే ఉంటుంది. అదే -నందుని చరితము వినుమా/ పరమానందము గనుమా. ఆలమూరులో మాలవాడలో పేదవాడుగా జనియించి చిదంబరేశుని పదాంబుజములే.. అంటూ సాగే పాటను పెండ్యాల అద్భుతంగా స్వరపరిచారు. గాయక చక్రవర్తి ఘంటసాల పాడిన ఈ పాట శిరోమాణిక్యం లాంటిది. జనరంజకమైన ఈ పాట నాకు చాలా ఇష్టం. నాకే కాదు ఉభయ గోదావరుల జిల్లాల వారంతా ఈ పాటంటే చెవి కోసుకుంటారు. కృష్ణా జిల్లా కళాకారులు 1950-60లో వచ్చిన ఈ పాటను తమ బ్యాండ్ గ్రూపులలో తప్పనిసరిగా పాడి వినిపించేవారు. ప్రతివారు అప్పట్లో ఈ పాటను విని ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందేవారు. తన యజమాని ఆనతి వేడెను శివుని జూడగా మనసుపడి చిదంబరంలో శివుని దర్శనం చేయగరాదనె పూజారి’. పూజారి మాటలకు నందుడు నిరాశతో ప్రాణాలు వదలిన సందర్భానికి ఘంటసాల ఉద్వేగంతో పాడటం మరువలేని విషయం. ఒక భక్తుని కథను, ఆయన మనసులో భక్తిని అద్భుతంగా ఆవిష్కరించిందీ పాట. అప్పట్లో ఈ పాట బాణీలో వివిధ దేవుళ్ల గీతాలను మలచుకుని భక్తులు పాడుకునే వాళ్లు కూడా. భక్తితత్వాన్ని బోధించే ఈ పాటను శ్రీశ్రీ రాయడం -అదీ ఈ సినిమాకు ఇదొక్కటే రాయడం మరో విశేషం. జయభేరి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ పాట వైవిధ్యమైనది. ప్రతి సినీ ప్రేక్షకుడు తన మనసులో ఈ పాటను పాడుకునేవాడు. పెండ్యాల బాణీ, దానికి తగిన విధంగా వాద్యాలు వినిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమా థీమ్స్‌లో ఒకటైన కుల నిర్మాలనా వాదం ప్రకటించే ఈ పాటలో సాకీయే అద్భుతంగా మొదలవుతుంది. అథములమని, అధికులమని నరుని దృష్టిలో భేదాలు/ శివుని దృష్టిలో అంతా సమానులు -అంటూ శ్రీశ్రీ వైవిధ్యంగా చెప్పారు. దళిత భక్తుడైన నందునికి, చిదంబరేశ్వరునికి మధ్య కులాచారాలు అడ్డుగోడలైతే శివుడే దాన్ని దాటుకుని రావడాన్ని శ్రీశ్రీ -చిన్న పిల్లలు సైతం తడుముకోకుండా అర్థంచేసుకునే రీతిలో రాశారు. సంగీతపరంగా ఆల్ కైండ్ హిట్స్ అన్న పేరును సంపాదించుకుంది. అందుకే ఈ పాటంటే నాకు ఇష్టం.
-పి సూర్యనారాయణ, రాజమండ్రి