Others

ఆలీబాబా 40 దొంగలు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు నాలుగు దశాబ్దాల క్రిందట విడుదలైన ఒక మంచి జానపద చిత్రం -ఆలీబాబా 40 దొంగలు. ఇందులో కధానాయకుడు ఎన్‌టి రామారావు. ఆయన ప్రియురాలు మార్జియానిగా జయలలిత, ఆలీబాబా అన్నగా నాగభూషణం, ఆయన భార్యగా సూర్యకాంతం తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. దొంగల నాయకుడిగా సత్యనారాయణ ఫర్వాలేదనిపించారు. క్లుప్తంగా చెప్పాలంటే ఒకరోజు కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్తాడు ఆలీబాబా. అక్కడ దొంగలు ఒక గుహ వద్దకెళ్లి ‘తెరుచుకో ససేం’ అంటారు. ద్వారం తెరుచుకుంటుంది. లోపలికెళ్లి తాము దోపిడీ చేసిన బంగారం, ఆభరణాలు ఉంచి బయటకు వస్తారు. వెళ్ళేటప్పుడు ‘మూసుకో ససేం’ అనడంతో గుహద్వారం మూసుకొంటుంది. ఇదంతా ఆలీబాబా గమనిస్తాడు. దొంగలు చెప్పినట్టే చెప్పి -అక్కడున్న ధనరాశులను మోయగలిగినన్ని ఇంటికి చేర్చుతాడు. ఇది తెలుసుకొన్న అన్న దురాశతో వెళ్లి బయటికొచ్చే మంత్రం మర్చిపోవడంతో అక్కడే ఉండిపోతాడు. దొంగలు వచ్చి అతన్ని చితకబాదుతారు. అన్న రాలేదనే బాధతో ఆలీబాబా వచ్చి అన్నను విడిపించి ఇంటికి తీసుకుపోతాడు. దొంగలు ఆలీబాబా నివాసం తెలుసుకోవడనికి ఒక గుర్తు పెడతారు. మార్జియానా అదే గుర్తును అన్ని ఇళ్లకు పెడుతుంది. చివరకు దుష్టుల సంహారంతో, అలీ- మార్జియానా పెళ్లితో కథ ముగుస్తుంది.
జానపద చిత్ర అభిమానులకు ఈ సినిమా ఓ కనువిందు. ‘అరేబియన్ నైట్స్ కథల్లోని ఆలీబాబా -్ఫర్ట థీవ్స్’ ఆధారంగా దర్శకుడు బి విఠలాచార్య అద్భుతంగా తెరకెక్కించారు. పాటలన్నీ దాదాపు జనరంజకంగా వున్నాయి. రాజబాబుది ఒక చిన్న ఉపాఖ్యానంలాగా హాస్యాన్ని అందిస్తుంది. అప్పట్లో ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ముఖ్యంగా సంభాషణలు సమకూర్చిన డివి నరసరాజు -తన కలానికున్న చమత్కారాన్ని ఈ సినిమాలో చిత్రంగా చూపించారు. డైలాగులన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. అలాగే, హెచ్‌ఎస్ వేణు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ సమకూర్చారు. లాంగ్‌షాట్స్‌లో గుహను చూపించిన విధానం, క్లైమాక్స్ సీన్స్‌లో కెమెరా టెక్నిక్ ఆడియన్స్‌ని రెప్ప వేయనీయవు. మన తెలుగు చిత్రాల్లో ఓ మంచి చిత్రం -ఆలీబాబు 40 దొంగలు. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.
-కె సుబ్రహ్మణ్యం