Others

భలే మంచి రోజు ( నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జరిగిన కథ -సినిమాలో సినారే రాసిన పాటను అభేరి రాగంలో స్వరపరిచి ఘంటసాల గానం చేసిన ‘భలే మంచి రోజు’ పాటంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రానికి దర్శకుడు కె బాబూరావు. సినారే మధుర భావాన్ని చక్కగా, సున్నితంగా తెరకెక్కించారు బాబూరావు. అటు కన్నతల్లిని, భార్యను, దైవాన్ని మనసారా తలచుకుని పాడే పాట. ‘భలే మంచి రోజు/ పసందైన రోజు/ వసంతాలు పూచే నేటి రోజు’ మనసుకు ఆహ్లాదం కలిగించే సమయం వసంతఋతువు. ఆ రోజులు అందరకు మంచి రోజులే కదా! ‘గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు/ గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు/ నింగిలోని అందాలన్నీ ముగింట నిలచిన రోజు’ -ఇందులో కవి నావన ఏమంటే, కోరుకున్నవన్నీ సఫలీకృతం అయ్యాయని ఆనందపడే రోజు. ‘చందమామ అందిన రోజు/ బృందావని నవ్విన రోజు/ తొలి వలపులు చిలికిన రోజు/ కులదైవం పలికిరోజు’- చందమామ అందడం, బృందావనం నవ్వడం అంటే కోరికలు తీరడం. తొలిప్రేమలోని మాధుర్యం, వీటికి తన ఇష్టదైవం సహకరించడంతో పులకించిపోయిన నాయకుడు నెమరువేసుకుని ఆనందించడం. ఈ పాట రెండో చరణంలో ‘బృందావని నవ్విన’ దగ్గర ఘంటసాల చిందించిన చిరునవ్వు మన మనస్సులను సున్నితంగా, సుతారంగా తాకుతుంది. ‘కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు’- ప్రతి తల్లీ తన కన్నబిడ్డలమీద మమకారాలు, ఆశలు అన్నీ వాస్తవ రూపం దాల్చాయని మిక్కిలి సంతోషపడటం ఈ చరణంలోని అంతరార్థం. ఈ పాట ఎంత ప్రజాదరణ పొందిందంటే ఆ రోజుల్లో మా గోదావరి జిల్లాలో పెద్ద కుటుంబాల్లోని సంగీత ప్రియుల నుంచి.. రైళ్లలో యాచకులు సైతం పాడుకునే పాటల్లో ఇదొకటైంది. సాధారణంగా ట్యూన్స్ ఇచ్చి పాట రాయించడం ఘంటసాల విషయంలో బహు అరుదు. కానీ ఈ గీతంలో పల్లవి, చరణాలకూ ఆయనే స్వయంగా స్వరాన్నిచ్చారని చెప్పారు సినారే ఓ సందర్భంలో. ఇక చిత్రీకరణ సైతం చాలా సింపుల్‌గా, ఆనాటి దర్శకుల ప్రతిభకు అద్దం పట్టేదిలా ఉంటుంది. జగ్గయ్య -అలనాటి పియోనాపై కూర్చుని పాటంతా పాడేస్తున్నా -్థయేటర్లలో కుర్చీల్లోంచి జనాలు లేవలేదు. అదీ గొప్పతనం. పాట మొత్తాన్ని పియానోమీదే చూపించేస్తారు. చరణానికీ చరణానికీ మధ్యలో -కృష్ణ తన ప్రియురాలితో రొమాంటిక్ డ్యాన్స్ భలే సరదాగా ఉంటుంది. అందుకే నాలాంటి వాళ్లకు ఈ పాట చాలా చాలా ఇష్టం.

-ఎన్ రామలక్ష్మి, సికింద్రాబాద్