S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్ ఫీచర్
ముఖానికి రంగేసుకున్నోడే -కళాకారుడు అనుకునేవాడిని. వేసుకున్న రంగులు కడుక్కుని అద్దంలో అసలు ముఖం చూసుకునే సందర్భం వచ్చిన ప్రతిసారీ -నేనేంటో నాకు తెలిసేది. అప్పుడర్థమయ్యేది -నన్ను నేను తెలుసుకోవడమే నిజమైన కళ అని. అలా నన్ను నేను వెతుక్కునే ప్రయత్నం మొదలెట్టా. వెతుక్కుంటూనే ప్రయాణించా. ఆ ప్రయాణంలో అర్థమైన విషయం ఒక్కటే -కోటి వేషాలు కూటి కొరకేనని.
కుక్క సినిమా షూటింగ్‌లో -ఎక్కడ కలిసినా నారాయణరావు పద్మను ఎత్తుకొని తిప్పేసేవాడట. ఏంటండీ ఇలా చేస్తున్నారని అడిగితే.. ఇలాంటి సీన్లు సినిమాలో చాలా ఉన్నాయిగా. ముందుగా ప్రాక్టీస్ చేస్తున్నా అంటూ నవ్వేసేవాడట. చివరికదే ఆ షూటింగ్ మొత్తం అలవాటుగా మారిందట.
పద్మ. కలువలాంటి ముఖాన్ని చూసి తల్లిదండ్రులు పెట్టిన పేరు. తన తల్లికి ఇష్టమని నృత్యం నేర్చుకుంటే -ఆ నృత్యమే ఆమెను నటిని చేసింది. అలా ఆమె చేసిన మొదటి సినిమా -కుక్క. ఆమె అభినయానికి మంచి పేరొచ్చింది. అప్పటినుంచీ ఇండస్ట్రీకి.. కుక్క- పద్మయ్యింది. ఇండస్ట్రీలో వెలుగు చుట్టూ చీకటి ఆవరించి ఉంటుందన్న విషయం -ఆమె వెలుగులోకొచ్చాకే తెలుసుకుంది. జాగ్రత్తపడినోళ్లు -చీకటిని జయిస్తారు.
ప్రాక్టీస్ మేక్స్ ఏ మేన్ పెర్ఫెక్ట్ -అన్నది చదువుకున్నప్పటి కంటే గొప్పవాళ్ల నుంచి నేర్చుకున్నపుడే ఎక్కువ ఫీల్ కలిగింది నాకు. స్టేజిమీద చేసినా, తెరపై చేసినా -రెండూ నటనే కదా! అనుకునే వాడిని. స్టేజిమీద, కెమెరాముందు -నటించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గొప్ప నటుడు నాగభూషణం చెప్పినపుడు ఆశ్చర్యమనిపించింది. స్టేజిమీద ఇచ్చినట్టు లిప్‌మూమెంట్‌ని కెమెరా ముందు ఇవ్వకూడదు.
ఎన్టీఆర్ అంటే -నందమూరి తారక రామారావు అంటారు కొందరు. పేరు అనుకోవచ్చు. ఎన్టీఆర్ అంటే -విశ్వవిఖ్యాత నటుడంటారు మరికొందరు. ప్రతిభ అనుకోవచ్చు. ఎన్టీఆర్ అంటే -యుగపురుషుడు అంటారు మరికొందరు. జన్మ సాఫల్యం అనుకోవచ్చు. కానీ -ఎన్టీఆర్ అంటే విజయం అనుకునేవాళ్లు కొందరుంటారు. దాన్ని తత్వమనుకోవాలి -ఎన్టీఆర్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటే. అనేక సందర్భాల్లో ఎదురైనా ఓటముల్నీ ఆయన గెలుపుగానే చూడాలి.
సినిమాల్లో చిన్న డైలాగ్ ఆర్టిస్టే అయినా -పెద్ద జీవితాన్ని చూశాడు శ్రీరామమూర్తి. అందుకే ఆయన లోతైన మాటల్లో తాత్వికత కనిపిస్తుంది. ‘కళామతల్లి నీడలో ఓ వెలుగు వెలగాలనే అంతా వస్తారు. కాకపోతే -అదృష్టాన్ని బట్టి కొందరు ఎదుగుతారు. కొందరు చరిత్ర సృష్టిస్తారు. అంతమాత్రాన -వెనుకున్న వాళ్లంతా మనుషులు కాదని కాదు. అది -స్వర్ణయుగం కాలంలోనే మేం చూశాం.
పుట్టేవాడి నుదుటిన రాత రాశాకే -్భమీదకు పంపుతాడు పుట్టించేవోడు.
భూమీదికెళ్లాక -వీడేం చేయాలన్నది నుదుటిమీదున్న స్క్రిప్ట్‌లోనే ఉంటుంది. రాసినోడికి ముందే తెలిసిన ఆ విషయం -రాయించుకున్నోడికి జీవితాన్ని చదవడం మొదలెట్టాక
తెలుస్తుంది. అప్పుడనుకుంటాం -ఓహో నా రాత ఇలా రాశావా! అని. అందుకే -జీవితం ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తుంది. అదొక నిరంతర పోరాటం. అది పూర్తయితే
నాలో ఇంకా సంగీతతృష్ణ తరిగిపోలేదు. సర్కారైనా, సంగీత పోషకులైనా నాకు సహకరించి సహాయమందిస్తే -సంగీత పాఠశాల నెలకొల్పాలన్న తపన ఇంకా ఉంది. నాకు దొరికిన సరస్వతీ కటాక్షాన్ని నలుగురికీ పంచి, నాలుగు తరాలకు నిలిచే ఉత్తమ గాయనీ గాయకులను తయారు చేయాలన్న సంకల్పం బలంగావుంది. ఈ విషయంలో కళామతల్లి కరుణ ఎంతవరకూ ఉందో చూడాలి -అంటూ తపన పడుతోంది తొమ్మిది పదులు దాటిన బాలసరస్వతమ్మ. ఏనాటివో, ఎన్నటివో ముచ్చట్లను
నిండుకుండ తొణకదు. స్ర్తికి ఎన్ని కష్టాలొచ్చినా, వాటిని భరిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ నలుగురిలో మణిలా మెరిసినోళ్లు మనమధ్యే ఎంతమందో. అలాంటి జాబితాలో ఓ స్వరరత్నాన్నీ చెప్పుకోవాలి. ఆమె -రావు బాలసరస్వతీదేవి. తొలి నేపథ్య గాయనిగా చరిత్ర సృష్టించి తెలుగు సినీ జగత్తులో ధృవతారగా ఎదిగిన అపర సరస్వతి. మద్రాస్ ఆకాశవాణి కేంద్రం ద్వారా తొలిసారిగా పాట ప్రక్రియను పరిచయం చేశారామె.
ఎదుగుతున్న మొక్కను చూసి -మట్టిలో పడున్న ఓ విత్తనానికి ఆశ పుట్టిందట. -నేనూ అలా ఎదగాలనుకుంది. అంతా నన్నూ చూడాలనుకుంది. ఈ విషయం తెలీని మొక్క మాత్రం మామూలుగానే ఎదుగుతోంది. విత్తనం అంకురించింది. తలపైకెత్తి మొక్కను చూస్తూ -ఎదగడం మొదలెట్టింది. ఎత్తిన తల దించకుండా ఎదిగి ఎదిగీ చెట్టైంది.
కొన్నాళ్లకు-