S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/28/2019 - 22:41

సినిమాలు చూసే ప్రేక్షకులకు నటించేవాళ్ల బాధలు ఎప్పటికీ తెలియవు. అవి పాటలు కానీ, ఫైట్స్ కానీ. ఒక్కొక్క సన్నివేశాల్లో నటించడానికి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడిపోతాం. ముఖ్యంగా లిప్ టు లిప్ కిస్ సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది అని చెబుతోంది పూజా హెగ్డే. తెలుగులో ప్రస్తుతం టాప్ లీడింగ్‌లో వున్న ఈ అమ్మడు, ముద్దు సీన్లు చేయడం అంత వీజీ కాదంటోంది.

12/28/2019 - 22:39

నయనతార అగ్ర కథానాయికగా కొనసాగుతూనే అనేకమందితో రొమాన్స్ చేసిందని గాసిప్స్ అప్పట్లో చాలా వచ్చేవి. ఏది ఎలా వున్నా, ఎప్పుడూ మీడియాలో వుంటూ ప్రేక్షకులకు తన స్టేటస్ ఏంటో తెలుపుతూనే వచ్చిందామె. తాజాగా అలాగే తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదుగుతున్న రష్మిక మండన కూడా నిరంతరం వార్తల్లో వుంటోంది.

12/28/2019 - 22:36

పి.పుల్లయ్య దర్శకత్వంలో 1959లో వచ్చిన సంగీత భరిత చిత్రం జయభేరి. నాగేశ్వరరావు, అంజలి, గుమ్మడి, శాంతకుమారి, రేలంగి, రమణారెడ్డి ప్రధాన తారాగణం.

12/28/2019 - 22:34

1959వ సంవత్సరంలో నాయిక షావుకారు జానకిపై చిత్రీకరించబడి, పిల్లలకు పాఠంగా పనికివచ్చే పాటకా మనసుకవి ఆత్రేయ ‘ఆలుమగలు’అన్న చిత్రానికి, ‘‘ఒకటి ఒకటి మానవులందరు ఒకటి’’ అంటూ ఒకటినుండీ పదిదాకా, వచ్చేలా అంకెలతోకూర్చి, ఒక ప్రబోధ గీతం వ్రాసారు. ఇందులో మానవులందరు ఒకటైనా మంచివాళ్ళని, చెడ్డవాళ్ళనీ మనలో జాతులు రెండు అంటారు ఆత్రేయ.

12/22/2019 - 04:43

స్ర్తి జాతిలో విప్లవ జ్వాలలు రేకెత్తించే విభిన్న కథాంశంతోకూడి జమున మొట్టమొదటిసారిగా నటించిన చిత్రం రాజా ప్రొడక్షన్స్ ‘పుట్టిల్లు’ (1953). ప్రజానాట్య మండలిలో ప్రముఖ పాత్ర వహించిన డాక్టర్ గరికపాటి రాజారావు కథ తానే వ్రాసుకొని దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం యిది. హీరో వేషం కూడా రాజారావే వేశారు. తొలి చిత్రంలోనే జమున ‘గ్లామర్‌గర్ల్’గా పేరుతెచ్చుకుంది.

12/22/2019 - 04:25

రవితేజ, భూమిక, గోపిక ప్రధాన పాత్రల్లో ప్రముఖ ఫొటోగ్రాఫర్ యస్ గోపాలరెడ్డి నిర్మాత, దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నా ఆటోగ్రాఫ్...స్వీట్ మెమరీస్’. రవితేజ శీను పాత్రలో లీనమై నటించాడు. ప్రతిఒక్కరి లైఫ్‌లోని తీపి జ్ఞాపకాలు గుర్తుచేసేలా హీరో పాత్ర ఉంటుంది. వివిధ దశల్లో హీరో జీవితంలోని అత్యద్భుత జ్ఞాపకాలుగా ప్రతి సన్నివేశాన్ని అద్భుత కావ్యమే చేశాడు దర్శకుడు. హీరో రవితేజ ప్రియుడిగా... బాధ్యతగల కొడుకుగా...

12/22/2019 - 04:23

రైతుల కడగండ్లు ఎలా ఉంటాయో చాటి చెబుతూ, వారిలో ఏమాత్రం ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కానరావని నమ్మిన బంటుగా ఇంట్లో తిరుగాడే జంతువులే మనిషికి అన్నివిధాల సహాయకారులుగా ఉంటాయని చెబుతూ రూపొందించిన చిత్రం -నమ్మినబంటు. అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, గుమ్మడిల అసమాన నటనా ప్రతిభతో ఈ చిత్రం అప్పట్లో వందరోజుల ఉత్సవాలు జరుపుకుంది. ముఖ్యంగా తెలుగుదేశంలో ఎక్కువ శాతం ప్రజలు రైతులే.

12/14/2019 - 23:09

ఎంజెలార్నా. పేరే కొత్తగా ఉంది కదూ. ప్రతిరోజూ పండగే చిత్రంలో పాత్రకూడా అలానే డిఫరెంట్‌గా ఉంటుంది. నా పాత్రకు చాలామంది కనెక్టైపోతారు.

, ,
12/14/2019 - 22:38

పి.పుల్లయ్య దర్శకత్వం వహించి కె.వి.రెడ్డి స్క్రీన్‌ప్లే వ్రాసిన చిత్రం ‘ధర్మదేవత’ (1952), స్వంత చిత్రానికి కాకుండా వేరే దర్శకుని చిత్రానికి కె.వి.రెడ్డి స్క్రీన్‌ప్లే వ్రాయడం విశేషం. కథ సంభాషణలు త్రిపురనేని గోపీచంద్ వ్రాశారు. కౌశిక్ అనే కొత్త యువకుడు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆయన సరసన గిరిజ నటించింది. ఈ చిత్రం తర్వాత కౌశిక్ ఏ.వి.యం.వారి ‘సదారమ’ (1952)లో కూడా నటించాడు.

12/14/2019 - 22:28

దర్శకుడు బాపు తీసిన సోషియో ఫాంటసీ. సంసారంలో అనుమానమనే విష బిందువు చిలికి చిందరవందరై.. భార్యాపరిత్యాగము, భర్తవియోగం, బిడ్డల ఆలనాపాలనా.. స్ర్తిజీవితంపై పడిన మచ్చవలన వచ్చిన సంఘర్షణతో బాపూ గీసిన అందమైన సెల్యులాయిడ్ చిత్రం ముత్యాలముగ్గు.

Pages