S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

12/14/2019 - 22:56

కృష్ణా జిల్లా దేవరకోట భూస్వామి దోనేపూడి బ్రహ్మయ్య. కళాహృదయుడు, సినిమాలపట్ల మంచి అభిరుచి గలవాడు. అలా సినిమా నిర్మాణంపట్ల ఆసక్తితో మదరాసు వెళ్లారు. హీరో కృష్ణతో ఓ సినిమా నిర్మించాలని భావించారు. అప్పటికే కృష్ణతో యాక్షన్, సెంటిమెంట్, సాహసోపేతమైన పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎం మల్లిఖార్జునరావు సారథ్యంలో బ్రహ్మయ్య రూపొందించిన చిత్రం -బందిపోటు భీమన్న.

12/10/2019 - 22:55

భారతం, రామాయణం, భాగవతం భారతీయులకు ప్రత్యేకమైన పురాణ గ్రంథాలు. వీటిలో భాగవతం, శ్రీకృష్ణుని మహిమలు, లీలలు, భగవత్ భక్తుల కథలతో నిండిఉంటుంది. శ్రీకృష్ణుని పేరు వినగానే, ఆ స్వామి లీలలు, చిద్విలాసాలు మనసును రంజింపచేస్తాయి. ఆ శ్రీ కృష్ణలీలలు ఆ స్వామి కథలకు సంబంధించిన అంశాలతో పలు చిత్రాలు రూపొందించాయి. కృష్ణుని లీలలకు చెందిన సంఘటనలలో తెలుగులో 3 చిత్రాలు, 2 డబ్బింగ్ చిత్రాలు రూపొందాయి.

11/30/2019 - 22:45

నటునిగా స్థిరపడిన తరువాత, చిత్ర నిర్మాణం పట్ల ఆసక్తి, మిత్రుల ప్రోత్సాహం, వారి అభిలాష తోడై కాంతారావు తొలుత తన భార్య పేరిట హేమా ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించారు. ఆ బ్యానర్‌పై ‘సప్తస్వరాలు’ సంగీత భరిత చిత్రాన్ని నిర్మించారు. తరువాత హేమా ఫిలిమ్స్‌ను సంజీవిని ఫిలిమ్స్‌గా పేరు మార్చి 1969లో కాంతారావు నిర్మించిన జానపద చిత్రం గండర గండడు.

11/23/2019 - 22:35

విశ్వనాథ సత్యనారాయణ సెప్టెంబర్ 10, 1895లో కృష్ణాజిల్లా నందమూరులో జన్మించారు. కవిగా సుప్రసిద్ధులైన వీరు 1916లో విశే్వశ్వర శతకంతో రచనా ప్రస్థానం ప్రారంభించారు. 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, పలు గేయ కావ్యాలు, నాటకాలు 50కి పైగా నవలలు, 10కి పైగా సంస్కృత నాటకాలు, పలు సాహిత్య ప్రక్రియలైన విమర్శనా గ్రంథాలు, వ్యాసాలు, ఉపన్యాసాలతో తెలుగు భాషకు వందల సంఖ్యలో రచనలు అందించారు.

11/09/2019 - 20:03

కొమ్మారెడ్డి సావిత్రి కృష్ణా జిల్లా చిర్రావూరి గ్రామంలో 1937 డిసెంబర్ 6న జన్మించారు. నటిగా అంతులేని విజయాలు సాధించారు. ‘మహానటి’గా పేరుపొందారు. కథానాయికలలో ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో -సాంఘిక, జానపద, పౌరాణిక ఏ అంశాని చెందిన సినిమాలోనైనా వైవిధ్యభరితమైన, ఆమెకే సొంతమైన ప్రత్యేక నటనతో ఆకట్టుకున్నారు.

11/02/2019 - 20:42

1967లో తమిళ నిర్మాత విటి అరసు షష్ఠీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందించిన తమిళ చిత్రం -కర్పూరం. ఎవిఎం రాజన్, పుష్పవల్లి జంటగా నటిస్తే, డిటి రామచంద్రన్, మనోరమ, నాగేష్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకులు సిఎన్ షణ్ముగం తెరకెక్కించిన చిత్రానికి ఉత్తమ తమిళ చిత్రంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.

10/26/2019 - 20:15

స్నేహబృందంతో కలిసి సినీ లలిత గీతాలు ఆలపిస్తూ ఆనందంగా కాలం గడిపేవారు జివిఆర్ శేషగిరిరావు. సినిమాల్లో గాయకునిగా రాణిస్తావంటూ స్నేహితులిచ్చిన ప్రోత్సాహంతో మద్రాస్ వెళ్లారు. దారిలో చేతి సంచి, సొమ్ము పోగొట్టుకొని మద్రాస్ పాండీబజారు చేరారు. అక్కడ తోటి కళాకారుల అనుభవాలు గ్రహించి, గాయకునిగా కంటే దర్శకత్వంలో ప్రతిభ చూపాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా సురేష్ మూవీస్ దర్శకత్వశాఖలో సహాయకునిగా చేరారు.

10/19/2019 - 20:34

సారథి పిక్చర్స్ ప్రై లిమిటెడ్ వ్యవస్థాపకుడు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్. అభ్యుదయభావాలు కలిగిన విద్యాధికులు. వారి ఆలోచనలు చిత్ర నిర్మాణంవైపు మళ్లడంతో తొలిసారి తాపీ చాణక్య దర్శకత్వంలో వల్లం నరసింహారావును హీరోగా పరిచయం చేస్తూ 1954లో ‘అంతా మనవాళ్లే’ సినిమా రూపొందించారు. సినిమా పూర్తిగా మద్రాస్‌లోనే నిర్మించారు.

10/12/2019 - 20:10

ప్రముఖ జానపద దర్శకులు బి విఠలాచార్య కుమారుడు బీవీ శ్రీనివాస్. తండ్రివద్ద పలు జానపద, సాంఘిక చిత్రాలకు సహాయకునిగా వ్యవహరించి మెళకువలు గ్రహించిన నేర్పరి. స్వీయ దర్శకత్వంలో ‘అగ్గిదొర’, ‘నినే్న పెళ్లాడుతా’ చిత్రాల ఒరవడితో.. 1969లో శ్రీ విఠల్ కంబైన్స్ పతాకంపై బి విఠలాచార్య నిర్మాణ పర్యవేక్షణలో యన్టీ రామారావు, రాజశ్రీల కాంబినేషన్‌లో రూపొందించిన జానపద చిత్రం -అగ్గివీరుడు.

10/05/2019 - 20:33

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా మాదేపల్లి గ్రామవాసి ఎం జయరామిరెడ్డి. వీరు హ్యూమన్ హెయిర్ వ్యాపారం చేసేవారు. సినిమాలపట్ల మక్కువతో మిత్రులు జెబికె చౌదరి (దర్శకుడు తేజ తండ్రి)తో కలిసి రెడ్డి అండ్ కంపెనీ బ్యానర్‌పై చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పతాకంపై తొలిసారి వీరు రూపొందించిన చిత్రం -్ధర్మపత్ని. జయరామిరెడ్డి అల్లుడు ప్రముఖ దర్శకుడు సాగర్.

Pages