S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

06/22/2019 - 20:20

రాజమండ్రికి చెందిన వైవి రావు (‘సువర్ణమాల’ చిత్ర నిర్మాణ బాధ్యతలకై 1948లో మద్రాస్ వచ్చారు) జర్నలిజంపై ఆసక్తితో టెంపోరావ్‌తో కలిసి ‘్ఫల్’, ‘టెంపో’ మొదలైన డిటెక్టివ్ సంపాదకవర్గంలో 1954 నుంచి పని చేశారు. వీరి బావ నిర్మాత భావన్నారాయణ స్థాపించిన గౌరీ ప్రొడక్షన్స్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

06/15/2019 - 20:56

ఆంధ్రదేశంలో తొలి ఎగ్జిబిటర్ అయిన పోతిన శ్రీనివాసరావు, అచ్చాయమ్మల రెండో కుమారుడు డూండేశ్వరరావు (డూండీ) 1932 జూన్ 9న విజయవాడలో జన్మించారు. విజయవాడ, రిషీవ్యాలీ, మద్రాస్‌లలో విద్య అభ్యసించారు. విజయవాడకు వచ్చే సినీ ప్రముఖులతో పరిచయాలు కలిగాయి. అలా విజయ నాగిరెడ్డి సలహాతో -అంజలీదేవి, రంజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నీలమలై తిరుడన్’ చిత్రాన్ని తెలుగులో ‘కొండవీటి దొంగ’గా అనువదించారు.

06/08/2019 - 20:53

1930 జూలై 9న తమిళనాడు తంజావూరులో జన్మించారు కైలాసం బాలచందర్. బీఎస్సీ చదివి మద్రాసులో అకౌంట్ జనరల్ ఆఫీసులో పని చేశారు. ఆ సమయంలోనే సర్వర్ సుందరం, మేజర్ చంద్రకాంత్ వంటి నాటకాలు రచించి ప్రదర్శించారు. అవి ప్రేక్షకుల ప్రశంసలు పొందటం, ఆ తరువాత అవి సినిమాలుగా రూపొందటం జరిగింది. వీరు కొన్ని చిత్రాలకు కథలు సమకూర్చటం, మరెన్నో (80కి పైగా) తమిళ, తెలుగు, హిందీ భాషా చిత్రాలకు దర్శకత్వం వహించటం జరిగింది.

06/01/2019 - 22:29

కృష్ణా జిల్లాలో 1924 అక్టోబర్ 31న జన్మించారు కొల్లి ప్రత్యగాత్మ. తాతినేని ప్రకాశరావువద్ద ‘ఇల్లరికం’ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. వీరి ప్రతిభను గుర్తించిన ప్రసాద్ ఆర్ట్స్ అధినేత ఏవి సుబ్బారావు, ‘ఇల్లరికం’ తరువాత 1961లో వారు రూపొందించిన ‘భార్యాభర్తలు’ చిత్రానికి దర్శకునిగా ప్రత్యగాత్మను ఎన్నుకున్నారు.

05/25/2019 - 20:34

ప్రముఖ నిర్మాత, దర్శకులు, నటులు కోవెలమూడి సూర్యప్రకాశరావు (కెఎస్ ప్రకాశరావు) దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా వాసిగాంచిన నందమూరి తారక రామారావు 2 చిత్రాల్లో నటించారు. 1967లో రామానాయుడు రూపొందించిన ‘స్ర్తిజన్మ’ ఒక చిత్రమైతే, 1969లో శ్రీరాజ్ ఆర్ట్స్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించబడిన ఆ రెండో చిత్రమే ‘విచిత్ర కుటుంబం’. ఈ 2 సినిమాల్లో యన్‌టిఆర్, కృష్ణలు సోదరులుగా నటించటం ప్రత్యేకాంశం.

05/18/2019 - 21:51

దేవ వైద్యులు అశ్వనీ కుమారులకు యజ్ఞ హవిర్భాగ్యం కలిగించిన చ్యవన మహర్షి, సుకన్య దంపతుల పౌరాణిక గాథ -సతీ సుకన్య చిత్రం.
శ్రీ వేంకటేశ్వరా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన సినిమా జనవరి 30, 1959న విడుదలైంది. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రమిది.

05/11/2019 - 20:46

శత చిత్ర నిర్మాతగా గిన్నీస్‌బుక్ వరల్డ్ రికార్డు సాధించిన వ్యక్తి దగ్గుబాటి రామానాయుడు. కారంచేడు గ్రామానికి చెందిన ఈయన చిత్ర నిర్మాణంపట్ల ఆసక్తితో తొలుత ‘కాంభోజరాజు కథ’ నిర్మాత భాస్కర్‌రావుతో కలిసి ‘అనురూప ఫిలిమ్స్’ పతాకంపై ‘అనురాగం’ చిత్రం రూపొందించారు. ఆ చిత్రం ఆర్థికంగా అంత విజయం సాధించలేదు.

05/04/2019 - 19:49

మహాలింగం వెంకటరామన్ (ఎంవి రామన్) తమిళనాడులోని తిరుచునాపల్లిలో 1913 జూన్ 26న జన్మించారు. అకౌంటెన్సీలో పట్ట్భద్రులయ్యారు. ఆపైన మద్రాసు శ్రీనివాసా స్టూడియోలో కెమెరామెన్‌గా, సౌండ్ ఇంజనీరుగా, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో అనుభవం సాధించారు. 1945 నుంచీ దర్శకునిగా ప్రయాణం మొదలెట్టారు.

04/27/2019 - 20:51

కృష్ణాజిల్లా పునాదిపాడులో 1926 జనవరి 20న పుట్టారు అనుమోలు వెంకట సుబ్బారావు. కొంతకాలం మద్రాస్‌లో రిపబ్లిక్ గార్డెన్స్‌లో నివసించారు. అప్పట్లో తాతినేని ప్రకాశరావు, ఎన్టీ రామారావు అదే ప్రాంతంలో నివసించటంతో వాళ్లతో పరిచయం కలిగింది. తాతినేని ప్రకాశరావు ప్రోత్సాహంతో ‘ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ప్రారంభించారు.

04/20/2019 - 20:42

1956లో ఏవీఎం స్టూడియోస్, ఎస్‌కె పిక్చర్స్‌తో కలిసి దర్శకుడు కృష్ణన్ పంజూ సారథ్యంలో తమిళంలో రూపొందించిన చిత్రం -కులదైవం. అంతగా అభివృద్ధి భావాలు చోటుచేసుకోని ఆ రోజుల్లోనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని కష్టనష్టాలు, విడో మ్యారేజీ అంశాలను పొందుపర్చి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించిన కథ ఆధారం.

Pages