S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

06/30/2018 - 21:41

1964వ సం.లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉత్తమ చిత్రాలకు, నంది పురస్కారాలు ఇవ్వటం ప్రారంభించింది. అన్నపూర్ణ సంస్థ వారు నిర్మించిన ‘డాక్టరు చక్రవర్తి’ చిత్రానికి నంది పురస్కారం, బంగారు నంది (ఉత్తమ చిత్రంగా) అవార్డు పొందింది.

06/23/2018 - 22:02

శోభనాచల స్టూడియోస్ చిత్ర నిర్మాణ వ్యవహారాలు, నిర్వర్తించే బుగతా అప్పల సుబ్బారావు (బి.ఏ.సుబ్బారావుగా పరిచితులు) 1949లో బి.ఏ.ఎస్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా మల్టీ స్టారర్ చిత్రం ‘పల్లెటూరిపిల్ల’ అక్కినేని, నందమూరి, అంజలిదేవిలతో స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. 1950లో విడుదలైన ఈ చిత్రం ద్వారా ఎన్.టి.రామారావుకు తొలిసారి హీరోగా అవకాశం ఇచ్చారు.

06/16/2018 - 20:24

నిర్మాత, దర్శకుడైన శ్రీ ఎల్.వి.ప్రసాద్ సోదరుడు, అక్కినేని సంజీవి ఎడిటింగ్‌లో శిక్షణ పొందారు. తొలిసారి ఎల్.వి.ప్రసాద్ నిర్మించిన ‘ఇల్లాలు’(1965) చిత్రానికి దర్శకత్వం వహించారు. 1968లో వీరి దర్శకత్వంలో నిర్మాత బాబూరావు కల్పనా చిత్ర పతాకంపై రూపొందించిన చిత్రం అత్తగారు-కొత్తకోడలు.

06/09/2018 - 21:31

మీర్జాపురం జమిందారు, వారు తమ సతీమణి, నటి, గాయని, నిర్మాత అయిన సి.కృష్ణవేణి, ప్రముఖ నటులు కె.రఘురామయ్యల కాంబినేషన్‌తో 1947లో రూపొందించిన చిత్రం ‘గొల్లభామ’. మధుర సుబ్బన్న దీక్షితులు తెలుగులో వ్రాసిన కాశీమజిలీ కథలు ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది.

06/02/2018 - 23:42

బందరులో బాలమిత్ర మండలిలో నటిగా కన్నాంబ, ప్రయోక్తగా కడారు నాగభూషణం పనిచేశారు. వారిరువురూ పరిణయం చేసుకొని శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి ద్వారా పలు నాటకాలు ప్రదర్శించి, ఆపైన శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ నెలకొల్పారు. మద్రాసులో చిత్ర నిర్మాణం చేపట్టారు. పలు విజయవంతమైన చిత్రాలను తమిళ, తెలుగు భాషల్లో రూపొందించారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చిత్రం నిర్మించే విధానానికి ఆద్యులు వీరే.

05/26/2018 - 21:52

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొల్లిపర వెంకటాద్రి, సుబ్బమ్మ దంపతులకు జనవరి 14, 1926న జన్మించారు కొల్లిపర బాలగంగాధర్ తిలక్. ప్రముఖ దర్శక, నిర్మాత యల్.వి.ప్రసాద్ వీరి మేనమామ. చిన్ననాటి నుంచి స్వాతంత్య్ర పోరాటం పట్ల, ఆసక్తిగల తిలక్ ముదిగొండ జగ్గన్నశాస్ర్తీ ప్రోత్సాహంతో ప్రజానాట్యమండలి సభ్యునిగా చేరి పలు నాటకాలు ప్రదర్శించేవారు.

05/19/2018 - 22:11

స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించారు పర్వతనేని గంగాధరరావు అనేకమంది స్నేహితులతో కలిసి ‘నవశక్తి ఫిలిమ్స్’పేరుతో హైదరాబాద్‌ళో తొలి తెలుగు చిత్రం ‘మా ఇంటి మహాలక్ష్మి’, మద్రాస్‌లో ‘కలిమి లేములు’ నిర్మించారు. ఆ తరువాత ‘హైదరాబాద్ మూవీస్’పేరిట ‘జల్సారాయుడు’(1960), పెళ్ళికాని పిల్లలు (1961), కీలుబొమ్మలు (1965) నిర్మించారు. 1967లో మొదలుపెట్టి 1968లో వీరు విడుదల చేసిన చిత్రం అర్ధరాత్రి.

05/12/2018 - 21:35

1942లో వచ్చిన జెమినీ వారి ‘బాలనాగమ్మ’లో నాగరాజుగా, 1953లో వచ్చిన హాస్య చిత్రం ‘పక్కింటి అమ్మాయి’లో సంగీతం మాస్టారుగాను నటించిన ప్రముఖ హాస్య నటుడు అడ్డాల నారాయణరావు. ప్రముఖ హాస్య నట చక్రవర్తి రేలంగి వెంకట్రామయ్యకు ఆత్మీయ మిత్రుడు. ఆయన ప్రోత్సాహంతో తొలిసారిగా 1960లో వచ్చిన ‘సమాజం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలోనే ప్రముఖ హాస్యనటుడు రాజ్‌బాబు సినీ రంగానికి పరిచయమయ్యారు.

05/05/2018 - 20:59

అక్కినేని నాగేశ్వరరావు వంటి మహా నటుడి, నట జీవితానికి పునాది వేసిన వ్యక్తి శ్రీ ఘంటసాల బలరామయ్య. 1906న నెల్లూరు జిల్లాలోని పొట్టిపామెలో జన్మించారు. నలుగురు అన్నదమ్ములలో 3వ వారు. పెద్దన్నయ్య రాధాకృష్ణయ్యతో కలిసి పలు నాటకాలలో నటించారు.

04/28/2018 - 22:23

నిర్మాత, నటుడు, దర్శకులు అయిన బి.ఆర్.పంతులు (బుడుగురు రామకృష్ణయ్య పంతులు) 1936లో ‘సంసార నౌక’ కన్నడ చిత్రం ద్వారా నటుడిగా ప్రవేశించారు. 1950లో పి.పుల్లయ్యగారితో కలిసి ‘మత్సరేఖ’ తమిళ చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత రచయిత పి.నీలకంఠంతో కలిసి పద్మిని పిక్చర్స్ నెలకొల్పి 1954లో ‘కల్యాణం, పనియం బ్రహ్మచారి’ తమిళ చిత్రాన్ని నిర్మించారు. ‘రత్నగిరి రహస్యం’ చిత్రంతో దర్శకత్వానికి శ్రీకారం చుట్టారు.

Pages