S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్ బ్యాక్ @ 50

11/02/2019 - 20:42

1967లో తమిళ నిర్మాత విటి అరసు షష్ఠీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందించిన తమిళ చిత్రం -కర్పూరం. ఎవిఎం రాజన్, పుష్పవల్లి జంటగా నటిస్తే, డిటి రామచంద్రన్, మనోరమ, నాగేష్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకులు సిఎన్ షణ్ముగం తెరకెక్కించిన చిత్రానికి ఉత్తమ తమిళ చిత్రంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.

10/26/2019 - 20:15

స్నేహబృందంతో కలిసి సినీ లలిత గీతాలు ఆలపిస్తూ ఆనందంగా కాలం గడిపేవారు జివిఆర్ శేషగిరిరావు. సినిమాల్లో గాయకునిగా రాణిస్తావంటూ స్నేహితులిచ్చిన ప్రోత్సాహంతో మద్రాస్ వెళ్లారు. దారిలో చేతి సంచి, సొమ్ము పోగొట్టుకొని మద్రాస్ పాండీబజారు చేరారు. అక్కడ తోటి కళాకారుల అనుభవాలు గ్రహించి, గాయకునిగా కంటే దర్శకత్వంలో ప్రతిభ చూపాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా సురేష్ మూవీస్ దర్శకత్వశాఖలో సహాయకునిగా చేరారు.

10/19/2019 - 20:34

సారథి పిక్చర్స్ ప్రై లిమిటెడ్ వ్యవస్థాపకుడు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్. అభ్యుదయభావాలు కలిగిన విద్యాధికులు. వారి ఆలోచనలు చిత్ర నిర్మాణంవైపు మళ్లడంతో తొలిసారి తాపీ చాణక్య దర్శకత్వంలో వల్లం నరసింహారావును హీరోగా పరిచయం చేస్తూ 1954లో ‘అంతా మనవాళ్లే’ సినిమా రూపొందించారు. సినిమా పూర్తిగా మద్రాస్‌లోనే నిర్మించారు.

10/12/2019 - 20:10

ప్రముఖ జానపద దర్శకులు బి విఠలాచార్య కుమారుడు బీవీ శ్రీనివాస్. తండ్రివద్ద పలు జానపద, సాంఘిక చిత్రాలకు సహాయకునిగా వ్యవహరించి మెళకువలు గ్రహించిన నేర్పరి. స్వీయ దర్శకత్వంలో ‘అగ్గిదొర’, ‘నినే్న పెళ్లాడుతా’ చిత్రాల ఒరవడితో.. 1969లో శ్రీ విఠల్ కంబైన్స్ పతాకంపై బి విఠలాచార్య నిర్మాణ పర్యవేక్షణలో యన్టీ రామారావు, రాజశ్రీల కాంబినేషన్‌లో రూపొందించిన జానపద చిత్రం -అగ్గివీరుడు.

10/05/2019 - 20:33

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా మాదేపల్లి గ్రామవాసి ఎం జయరామిరెడ్డి. వీరు హ్యూమన్ హెయిర్ వ్యాపారం చేసేవారు. సినిమాలపట్ల మక్కువతో మిత్రులు జెబికె చౌదరి (దర్శకుడు తేజ తండ్రి)తో కలిసి రెడ్డి అండ్ కంపెనీ బ్యానర్‌పై చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పతాకంపై తొలిసారి వీరు రూపొందించిన చిత్రం -్ధర్మపత్ని. జయరామిరెడ్డి అల్లుడు ప్రముఖ దర్శకుడు సాగర్.

09/28/2019 - 20:17

మలయాళ నాటక రచయిత తోఫల్‌బాసి వ్రాసిన ‘తులాభారం’ నాటకాన్ని కేరళ పీపుల్స్ ఆర్ట్ క్లబ్ ప్రదర్శించింది. ఆ నాటకం ఆధారంగా అదే పేరిట ప్రముఖ మళయాళ దర్శకుడు ఎ వినె్సంట్ ‘తులాభారం’ చిత్రం నిర్మించారు. హరిపోతన్, సుప్రియ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం దేవరాజన్. చిత్రంలో ప్రేమ్‌నజీర్, తెలుగు నటి శారద జంటగా నటించగా.. మధు, షీలా, కాంచన, తిక్కరసు సుకుమారన్ నాయర్, ఆదూరిబాసి ఇతర పాత్రలు పోషించారు.

,
09/21/2019 - 20:56

మద్రాస్‌లో పొన్నలూరి బ్రదర్స్ సొంత స్టూడియో నిర్మించారు. పొన్నలూరి బ్రదర్స్ బ్యానర్‌పై ఇదే స్టూడియోలో 1957లో ‘్భగ్యరేఖ’ చిత్రాన్ని యన్టీ రామారావు, జమున కాంబినేషన్‌లో రూపొందించారు. ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాహినీ సంస్థ చిత్రాలకేకాక ఇతర చిత్రాల సంస్థలకూ బిఎన్ రెడ్డి పనిచేయటం ‘్భగ్యరేఖ’తోనే ప్రారంభం కావటం విశేషం.

09/14/2019 - 20:21

ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ, రేఖా చిత్రకారులు బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) కలిసి చిత్ర నిర్మాణానికి సంకల్పించి 1967లో ‘సాక్షి’ని నందనా ఫిలింస్ బ్యానర్‌పై రూపొందించారు. ఆ చిత్రం సక్సెస్ సాధించింది. ఆత్మీయులైన అక్కినేని నాగేశ్వరరావు ఆ చిత్రంలో నటించనందుకు కొద్దిగా నొచ్చుకొన్నారు. మరో పిక్చర్‌కు కథ రెడీ చేసుకోండి, నేను నటిస్తాను అని హామీ ఇచ్చారు.

09/07/2019 - 20:30

అట్లూరి పుండరీకాక్షయ్య కృష్ణా జిల్లా చౌటుప్పలో 1925 ఆగస్టు 19న జన్మించారు. యన్టీ రామారావు కుటుంబంతో స్నేహం, బంధుత్వం కలిగినవారు. నందమూరి సోదరులతో కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ప్రదర్శించే పలు నాటకాల్లో నటించారు. తరువాత అదే బ్యానర్‌పై రూపొందించిన చిత్ర నిర్మాణంలో నిర్మాణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేవారు.

08/31/2019 - 20:29

ఈస్టిండియా ఫిలిం కంపెనీ అధినేత చమ్రియా. వీరు మద్రాసులో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ నెలకొల్పారు. ఆ కంపెనీ మేనేజర్‌గా సుందర్‌లాల్ నహతా కొంతకాలం వ్యవహరించారు. చిత్ర పరిశ్రమలో అనుభవజ్ఞులైన తారాచంద్ బర్జాత్యాతో స్నేహంలో చిత్ర నిర్మాణ రంగానికి చెందిన అనేక విషయాలను వారివద్ద అభ్యసించారు. తరువాత రాజశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ సంస్థలో ప్రధాన పాత్ర పోషించారు.

Pages